సాంకేతికతను ఉపయోగించి, సి‌సి కెమెరాల ద్వారా ఆలయ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను

*సాంకేతికతను ఉపయోగించి, సి‌సి కెమెరాల ద్వారా ఆలయ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన అవనిగడ్డ పోలీసులు*

.




*నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసి 16.9 కేజీల వెండి, బంగారు మంగళసూత్రం రికవరీ చేసిన అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐ‌పి‌ఎస్ గారు.* 


కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతంలో ఆలయ చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టి కేసును చేదించారు. చోరీకు గురైన 16.9 కేజీల వెండి ఆభరణాలు మరియు బంగారు మంగళసూత్రాన్ని రికవరీ చేయడంతో పాటు, నిందితులు ఉపయోగించిన కారును మరియు వెండి కరిగించే మెషిన్‌ను సీజ్ చేయడం జరిగింది

 

*కేసు వివరాలు:*


ది. 02/03.02.2025 రాత్రి సమయంలో, పులిగడ్డ గ్రామంలోని శ్రీ అలివేలు మంగా రాజ్యలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడి తాళం పగులకొట్టి స్వామివారి వెండి కిరీటం, వెండి మకర తోరణం దొంగిలించారు.


దీని పై అగ్నిహోత్రం ధన్వంతరి ఆచార్యులు వారి ఫిర్యాదు మేరకు అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెంబర్ 40/2025 U/s 331(4), 305 BNS కింద కేసు నమోదు చేయబడింది.

కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఐ‌పి‌ఎస్ గారి ఆదేశాల మేరకు, అవనిగడ్డ DSP శ్రీ T. విద్య శ్రీ గారి పర్యవేక్షణలో, అవనిగడ్డ CI శ్రీ. జి.యువకుమార్ మరియు అవనిగడ్డ ఎస్‌ఐ కె. శ్రీనివాసరావు, నాగాయలంక ఎస్ఐ కే. రాజేష్ మరియు వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఒక వైపు గాలింపు చర్యలు చేపడుతూ మరోవైపు సాంకేతికతను ఉపయోగించి టవర్ అనాలసిస్, సి‌సి‌టి‌వి ల పర్యవేక్షణ ద్వారా ముద్దాయిలను గుర్తించి వారిని ఈ రోజు అనగా ది. 06.02.2025 న అరెస్ట్ చేసి, చోరీకి గురైన మొత్తం ప్రాపర్టీతో పాటుగా గతంలో అవనిగడ్డ మండలం కొత్తపేట సాయిబాబా గుడి, కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో శ్రీ మన్నారాయణ స్వామీ వారి గుడి, మోపిదేవి మండలం టేకుపల్లిలో గల శ్రీ బాల పార్వతి సమేత రామేశ్వరస్వామి వారి గుడిలలో జరిగిన చోరి కేసుల యొక్క ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. 


*రికవరీ వివరాలు:*

   

_రూ. 16.05 లక్షల విలువైన 16.90 కిలోల వెండి వస్తువులు._


1. వెండి కిరీటం, వెండి మకరతోరణం మొత్తం 3.18 కేజీల వెండి సుమారు విలువ రూ.3,00,000/-

(Cr.No: 40/2025 U/s 331(4), 305 BNS of Avanigadda PS)


2. వెండి కిరీటం, మూడు వెండి అచ్చులను మొత్తం 1.15 కేజీల వెండి సుమారు విలువ రూ.1,10,000/-

(Cr.No: 109/2023 U/s 457, 380 IPC of Avanigadda PS)


3. వెండి పాత్రలు-12, ఉద్దరిణిలు-2, వెండి గొలుసు-1 మొత్తం వెండి 3.6 కేజీల వెండి మరియు బంగారు మంగళ సూత్రాలు సుమారు మొత్తం విలువ రూ.3,40,000/- 

(Cr.No.223/2023 U/s 457, 380 IPC of Koduru PS)


4. తొమ్మిది వెండి అచ్చులు మొత్తం 9 కేజీల వెండి సుమారు విలువ రూ. 8,55,000/-

(Cr.No.295/2024 u/s 457, 380 IPC of Challapalli PS)


*అరెస్టు చేసిన ముద్దాయిలు వివరాలు:*


1) పీతా బ్రహ్మానందం, తండ్రి పేరు బాలకృష్ణారావు, వయసు 54 సంవత్సరాలు, కులం అగ్నికుల క్షత్రియ, పెదప్రోలు గ్రామం, మోపిదేవి మండలం.


2) షేక్ హమీద్, తండ్రి పేరు హుస్సేన్, వయసు 66 సంవత్సరాలు, కులం ముస్లిం, డోర్ నెంబర్: 2000, ఇబ్రహీం, మసీద్ స్ట్రీట్, 5 వ లైను, RTC కాలనీ, కొత్తపేట, గుంటూరు.


కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు గారు మాట్లాడుతూ అవనిగడ్డ సబ్ డివిజన్ నందు ఆలయములో జరిగిన 4 చోరి కేసులలో సుమారు  16.9 కేజీల వెండి ఆభరణాలు మరియు బంగారు మంగళ సూత్రం (మొత్తము విలువ 16,05,500/-) లను ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేసి, వారు దొంగతనానికి ఉపయోగించిన AP 40 BY 4021 నెంబర్ గల Grand i10 కారుని మరియు వెండి కరిగించే మెషిన్ ను వారి వద్ద సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ కేసును త్వరితగతిన చేదించడంలో ప్రతిభ కనబరచిన అవనిగడ్డ DSP శ్రీ. T. విద్య శ్రీ, అవనిగడ్డ CI శ్రీ. జి.యువకుమార్, అవనిగడ్డ ఎస్‌ఐ కె. శ్రీనివాసరావు, నాగాయలంక ఎస్ఐ కే. రాజేష్ మరియు సిబ్బందికి క్యాష్ రివార్డ్స్ అందించి అభినందించారు. అలాగే నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సి‌సి‌టి‌వి కెమేరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.