ఆలపాటి రాజా గారి విజయం తథ్యం
.మాజీ ఎమ్మెల్యే, మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి గారు.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం.
ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాల ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి విజయం తథ్యమని మాజీ ఎమ్మెల్యే, మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్, ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ ఉండవల్లి శ్రీదేవి గారు పేర్కొన్నారు. కొండపల్లి టీడీపీ కార్యాలయంలో శనివారం రాత్రి సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీదేవి గారు మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషి చేయాలని సూచించారు. నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలి వచ్చారని, ప్రచారంలో ఆయనకు వస్తున్న ఆదరణ చూస్తే గెలుపు నల్లేరుపై నడకే అనిపిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వంలో రహదారులపై ప్రయాణం ఉయ్యాల.. జంపాల మాదిరిగా ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రహదారులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రభుత్వం పింఛన్లు పెంచి అందిస్తుందని, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతుందని, త్వరలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా గారిని గెలిపించాలని కోరారు. అనంతరం ఉండవల్లిని స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ ధారూనాయక్ గారు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు గారు, కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు గారు తదితరులు పాల్గొన్నారు.