మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలపై ఈసీకి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు

*విజయవాడ*

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలపై ఈసీకి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు 




తిరుపతి, హిందూపురం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లపై దాడికి తెగబడిన కూటమి నేతలు.. దాంతో ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్‌లో జరుగుతున్న ఎన్నికలను వాయిదా వేయాలని కోరిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు  


ఈ మేరకు విజయవాడ బందర్ రోడ్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి వినతిపత్రం అందజేసిన ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్,మాజీ ఎమ్యెల్యే మల్లాది విష్ణు,  విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి  తదితరులు..


*దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు*


తిరుపతిలో ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతలు దాడి చేసారు.


ఎన్నికల్లో ప్రత్యేక అధికారిని నియమించాలని నిన్న ఎన్నికల కమిషనర్ ను కలిసి పిర్యాదు చేసాము.


భయపెట్టి,బతిమాలి,

ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలవాలని  టీడీపీ నేతలు చూస్తున్నారు.


ఎన్నికలు జరుగుతున్న పోలిసు వైఖరి చూస్తుంటే ఆశ్చర్యం కలిగించింది.


బహిరంగంగా దాడులు చేస్తున్న పోలిసులు చోద్యం చూస్తున్నారు.


తక్షణమే ఎన్నికలను నిలిపివేయాలి


*మల్లాది విష్ణు,మాజీ ఎమ్మెల్యే*


ఎన్నికల కమిషన్ ను కలిసి నిన్న అన్ని అంశాల్ని వివరించాము.


టీడీపీ నేతలు ఎదెచ్చగా వైసిపి నేతలపై దాడులకు పాల్పడ్డారు.


ఎన్నికల కోసం వెళ్తున్న వైసిపి ప్రజాప్రతినిధులపై కిరాయి మూకలు దాడి చేసారు.


టెంపుల్ సిటి తిరుపతిలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం.


తిరుపతిలో ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన మరణాల ఘటన మార్చిపోకముందే దాడుల సంస్కృతిని తెరపైకి తెచ్చారు.



జగన్ పేరు విన్నా వైసిపి జెండా అన్నా కూటమి నేతలు బయపడుతున్నారు.


దౌర్జన్యాలు చేసి దమనకాండ సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు.



ఎన్నికలను వాయిదా వేయాలని కోరాం.


ఎన్నికలు జరుగుతున్న చోట  భద్రత కల్పించాలని  డీజీపీని ఆదేశించాలని కొరాము.


పోలీసులకు ముందుగానే చెప్పాం అయినా కూడా వారంతా  చోద్యం చూస్తున్నారు.


అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు.


*భాగ్యలక్ష్మి,మేయర్*


తిరుపతిలో కూటమి నేతలు విద్వంసం సృష్టించారు.


మేయర్,ఎంపి,ఎమ్మెల్సీ ఉన్నారన్న గౌరవం లేకుండా తిరుపతిలో దాడులు చేశారు.