కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ.... గుడివాడలో ఎమ్మెల్యే రాము విస్తృత ప్రచారం

 *మంచి వ్యక్తి ఆలపాటి రాజాను... అత్యధిక మెజార్టీతో పెద్దల సభకు పంపిద్దాం:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

*కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ.... గుడివాడలో ఎమ్మెల్యే రాము విస్తృత ప్రచారం*









గుడివాడ ఫిబ్రవరి 19:శాసనమండలి ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీను కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అందిస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.


ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టబద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ... గుడివాడ పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో ఎమ్మెల్యే రాము బుధవారం విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు మరియు పట్టభద్రులతో సమావేశమై... ఆలపాటి గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ.... ఆయనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఘనవిజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.


ఈసందర్భంగా అధ్యాపకులు తమ సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా... పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని  హామీ ఇచ్చారు.


 ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి విజయం ఖాయమైన అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల మంచి కోసం పట్టభద్రులందరూ ఆలపాటి రాజాకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రబాబు , వైస్ ప్రిన్సిపల్  అలియా బేగం, లెక్చరర్లు, మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.