విలువలతో కూడిన రాజకీయం చేస్తాను; కె.ఎస్ లక్ష్మణరావు
రాజకీయ నాయకులు పోటీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా సమస్య పరిష్కారానికి ముందు ఉంటాను.
న్యూస్9 చిలకలూరిపేట: పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అభ్యర్థి పిడిఎఫ్ కె.ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలతో పాటు, ఆయా ప్రజా సంఘాల సమస్యలను మండలిలో ప్రస్తావించడమే కాకుండా పోరాటాల రూపంలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేశామన్నారు. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు పోటీ చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. కార్మిక అంగన్వాడి, ఆశా వర్కర్లు నిరుద్యోగుల సమస్యల చట్టసభలో వినిపించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు గా తాము చట్టసభలో విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నానని పేర్కొన్నారు. 2007 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైనా రాజీ పడకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాను, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటామని ప్రజా సమస్యల పోరాటంలో ముందుంటామని విమర్శలకు తావు లేకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వివరించారు.