*ఆర్టీఓ యూనిట్ ఆఫీసు, జగ్గయ్యపేట*
*ఆటోలలో ఎక్కువమందిని ఎక్కించొద్దు*
*ప్రయాణికుల ప్రాణాలతో చేలాగటలొద్దు*.
యం.వి. ఇన్స్పెక్టర్ ఎం నారాయణ రాజు
ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, ప్రయాణికుల ప్రాణాలతో చేలాగటలొద్దని మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎం నారాయణరాజు అన్నారు.
రోడ్డు భద్రత మసోత్సవాలలో భాగంగా ఆటో డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సుని శనివారంనాడు పట్టణంలోని రవాణాశాఖ యూనిట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఎం వి ఇన్స్పెక్టర్ నారాయణరాజు మాట్లాడుతూ డ్రైవర్లు వాహనదారులు పాదచారులు రోడ్డు భద్రత నియమాలను తప్పక పాటించాలని అన్నారు.ఆటోలలో ఎక్కువమందిని ఎక్కించుకొని ప్రమాదాలకు గురి కావద్దని ఆయన అన్నారు. డ్రైవర్లకు ఇరువైపున ప్రయాణికులను కూర్చోపెట్టారాదన్నారు. ప్రయాణికులను క్షేమంగా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉంటుందని గుర్తుచేశారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మాట్లాడలన్నారు. మద్యం తాగి ఆటోలను నడపడం సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపడం చేయొద్దన్నారు. ఆటోలలో టేప్ రికార్డర్లు ఉపయోగించకూడదన్నారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ఆర్ శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ గురవయ్య, ఆటో యూనియన్ అధ్యక్షులు ప్రభు యూనియన్ నేతలు సాంబయ్య సైదులు మరియు రాజు తదితరులు పాల్గొన్నారు.