భక్తులకు మెరుగైన సౌకర్యం అందించేందుకు చర్యలు...
ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్
పి వెంకటేశ్వరావు
పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ పి వెంకటేశ్వరావు తెలిపారు.
అమ్మవారి తిరునాల్లో శనివారం రాత్రి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించడంతో అమ్మవారిని దర్శించేందుకు ఎదురుగండ దీపాలు ఇచ్చేందుకు వేలాది భక్తజనం ఉయ్యూరుకు తరలి రావడంతో ఒక్కసారిగా సందడి నెలకొంది.
ఈ క్రమంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు పారిశుద్ధ్య నివారణ పనులను ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు. తిరునాళ్ల సందర్భంగా పట్టణ పురవీధుల్లో ఏ ఒక్క ప్రాంతంలోనూ చెత్తాచెదారాలు ఇతర వ్యర్ధాలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని పర్యవేక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ వివరించారు.