ధి:6-2-2025 గురువారం ఉదయం 10:00"గం లకు "సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియం నందు శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది...
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా:- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు పాల్గొనడం జరిగినది...
ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ:- ఈరోజు శ్రీరాం స్కూల్ యాజమాన్యం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 18 సంవత్సరాలుగా ఈ పరిసర ప్రాంతాల పిల్లలకు విద్యని అందిస్తూ మంచి పేరును సంపాదించుకుందని...
పిల్లలకు చదువుతోపాటు క్రీడ లు కూడా నేర్పిస్తూ, ఇదే తరహాలో మిగిలినటువంటి పాఠశాలలో కూడా ఇటువంటి స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేసి పిల్లలకు మంచి అవగాహన తీసుకొని వచ్చి వారి భవిష్యత్తు ను తీర్చిదిద్దడం చాలా అవసరమని, ఈ కాలంలో పిల్లలకు ఒక్క చదివే కాకుండా క్రీడలలో కూడా నైపుణ్యం చాలా అవసరమని ప్రతిరోజు పిల్లలకు సాయంత్రం ఒక గంట సేపు క్రీడలు నేర్పించడం వల్ల పిల్లలకు వ్యాయామం గా ఉంటుందని అలాగే రేపు భవిష్యత్తులో కూడా మంచి స్థానాలకు వెళ్లడానికి కూడా అవకాశం ఉన్నదని, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా క్రీడలకు అత్యధికంగా ప్రాధాన్యతను ఇస్తుందని, క్రీడాకారులకు ఎడ్యుకేషన్ రుణాలు అందించడం, జాబ్ రిజర్వేషన్స్, భవిష్యత్తులో అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ను ఏర్పాటు చేసి జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి, ఏషియాలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని...
గతంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏషియన్ లెవెల్ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, ఒక స్పోర్ట్స్ విలేజ్ గా గచ్చిబౌలి స్టేడియం ను నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దడం వల్ల, ఎంతోమంది క్రీడాకారులు అక్కడ నుండి విజేతలుగా నిలిచారని, అదేవిధంగా నూతన నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని బొండా ఉమ గారు తెలియజేశారు...
ఈ కార్యక్రమంలో:- శ్రీరామ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు బోని సురేష్ కుమార్, బోని మాధురి, Ex కార్పొరేటర్ పిరియా జగదాంబ, దాసరి ఉదయశ్రీ, కంచి ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు...