కృష్ణాజిల్లా
ఉయ్యూరు
*క్షుద్ర పూజలపై స్పందించిన టిడిపి మండల అధ్యక్షుడు యేనిగండ్ల కుటుంబరావు*
గత 20 సంవత్సరాల నుంచి గ్రామంలో తమ కుటుంబం వైసీపీకి చెందిన పాలడుగు శివ జ్యోతి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాము.
ఎన్నికల వరకు రాజకీయాలు అని తర్వాత గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే విధంగా ఉండాలి కానీ..
వైసీపీకి చెందిన పాలడుగు శివ జ్యోతి అనే ఆవిడ తనకు గ్రామంలో ప్రత్యర్థులు ఉండకూడదని దురుద్దేశంతో ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు.
గత పంచాయతీ ఎన్నికలలో తమపై పోటీ చేసి పాలడుగు శివ జ్యోతి ఓడిపోయింది అని గుర్తు చేశారు.
ప్రజలకు మంచి చేస్తే ఓట్లు వేస్తారు అంతేకానీ ధారాళంగా డబ్బు ఖర్చు పెడితే ప్రజలు మన్ననలు పొందలేరని..
ఓటమి చెందిన దగ్గర నుంచి కక్ష పూరితంగా గ్రామంలో అలజడులు సృష్టిస్తూ ప్రతి చిన్న విషయంలో గొడవలకు దారితీస్తూ గ్రామంలో భయానక వాతావరణం సృష్టిస్తుంది అని అన్నారు.
గడచిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి అండ చూసుకొని రెచ్చిపోయింది అని కానీ చివర ఆఖరికి గ్రామ ప్రజలు గ్రామంలో తాము చేసిన అభివృద్ధిని చూసి బోడె ప్రసాద్ కు 670 ఓట్ల మెజారిటీ అందించారని తెలిపారు.
గ్రామంలో మా కుటుంబాన్ని అడ్డు తొలగించుకుంటే ఆమెకు ఎదురు ఉండదని భావించి క్షుద్ర పూజలకు తెరలేపియింది.
ఆమె చేసిన పనికి గ్రామంలో కొందరు భయానికి లోనై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసు వారు వీలైనంత త్వరగా ఆమెను అరెస్టు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురవ్వకుండా చూడాలని కోరారు.