గుణదల మేరీమాతను దర్శించుకున్న కేశినేని వెంకట్
విజయవాడ :దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గుణదల మేరీమాత ఆలయాన్ని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తనయుడు తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు కేశినేని వెంకట్ సందర్శించారు.
గుణదల మేరీ మాత ఉత్సవాలు సందర్భంగా మంగళవారం గుణదల చర్చిలో కేశినేని వెంకట్ కొవ్వొత్తులు వెలిగించి మేరీమాత ను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా గుణదల పుణ్యక్షేత్రం రెక్టార్ యేలేటి విలియం జయరాజు ప్రత్యేక ప్రార్థనలు చేసి కేశినేని వెంకట్ కు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కేశినేని వెంకట్ మాట్లాడుతూ ప్రసిద్ది పుణ్యక్షేత్రమైన గుణదల మేరీమాత పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై మేరీమాత ఆశీస్సులు మెండుగా అందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ దాసరి గాబ్రియేల్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ (దళితరత్న) ,టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, టిడిపి సీనియర్ నాయకులు నరసింహ చౌదరి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సొంగా సంజయ్ వర్మ, తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ దేవరపల్లి ఆంజనేయులు, విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు జి.వి.నరసింహారావు, తూర్పు నియోజకవర్గ ఐటిడిపి ఇన్చార్జ్ సిద్దెల వివేక్, గుణదల చర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎన్.విజయరాజు, కౌన్సిల్ సభ్యులు దాసరి సిల్వ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.