వసంత పంచమి సందర్బంగా బ్రిలియంట్ స్కూల్ లో సామూహిక అక్షరాభ్యాసం
ఈరోజు వసంత పంచమి సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్ ఆవరణలో విద్యార్థినీ విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ప్రెసిడెంట్ అయితా వెంకట ప్రసాద్ ఆడిటర్, 𝚅 𝟸𝟶𝟺𝙰 𝚙𝚊𝚜𝚝 𝙳𝚒𝚜𝚝. గవర్నర్ కొలిశెట్టి శివ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు, నోట్ బుక్స్ పలకలు పంపిణీ చేయుట మరియు వ్యాసరచన పోటీలలో బహుమతులు గెలుచుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు అందజేయడం జరిగినది.