ఎన్డిఎ కూటమి ప్రభుత్వం పింఛన్ దార్లు నోటి కాడ కుడు తీసి వేయటం చాలా దుర్మార్గం గన్నవరం జడ్పీటీసి అన్నవరపు ఎలిజబెత్ రాణి
ఎన్నికల ముందు ఇంటిలో ప్రతి వ్యక్తి కి ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఇప్పుడు ఓడ ఎక్కిందాకా ఓడ మల్లయ్య ఓడ దిగిన తరువాత బోడి మల్లయ్య అన్నా సామెత లాగా గత ప్రభుత్వం పేదలకు కులము మతం రాజకీయం చూడకుండా ప్రతి పేదవాడికి జగనన్న భరోసాతో ఇచ్చిన పెన్సన్లు రద్దు చేయటాన్ని గన్నవరం జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి ప్రభుత్వంన్ని త్రివరంగా కండించారు. ఆమే మాట్లాడుతూ
ఏపీలో 18,036 మంది పింఛన్లను తొలగించారు అని అన్నారు ఆ కుటుంబాలు రొడ్డన పడవలసిన పరిస్థితి ఈ సర్కార్ తెచ్చిందoన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీని లిస్టు ప్రకటిoచారు ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే. దివ్యాంగ పింఛన్లు అనర్హులను ప్రభుత్వం తొలగించడంతో జనవరిలో 63,77,943 మంది పింఛన్ లబ్దిదారులు ఉండగా ఫిబ్రవరిలో 63,59,907కు తగ్గింది. దీంతో పింఛన్ల జాబితా నుంచి తొలగించిన 18,036 మంది ఇకపై పింఛన్ పొందలేరు.ఇప్పుడు ఆపేదలే ఎన్డిఎ ప్రభుత్వంకు గుణపాఠం చెపుతారు అని ప్రభుత్వంన్ని హెచ్చిరించారు.