చిన్నారి దొండపాటి హన్సినిని ఆశీర్వదించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 07.02.2025.
మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెం గ్రామ వాస్తవ్యులు, మాజీ జెడ్పీటీసి దొండపాటి రాము గారి మనుమరాలు, తెలుగునాడు విద్యార్థి సంఘం (టి.ఎన్.ఎస్.ఎఫ్) రాష్ట్ర అధికార ప్రతినిధి దొండపాటి విజయకుమార్ గారు, అనూష గారి దంపతుల కుమార్తె చిన్నారి హన్సిని అన్నప్రాసన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుక్రవారం కీర్తిరాయునిగూడెం గ్రామంలో వారి నివాసానికి వెళ్లి చిన్నారి హన్సినిని ఆశీర్వదించారు. దొండపాటి విజయకుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.