వంశీ ఫోన్‌లో కీలక ఆధారాలు?దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు...

 *వంశీ ఫోన్‌లో కీలక ఆధారాలు?దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు...!*

ఆంద్రప్రదేశ్



టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్‌ను అపహరించి దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 


ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫోన్‌పై పోలీసులు దృష్టి సారించారు. 


ఈ ఫోన్‌లో కీలకమైన ఆధారాలు లభించే అవకాశాలు ఉందని పోలీసులు భావిస్తున్నారు. 


హైదరాబాద్‌లో అరెస్ట్ చేసే సమయంలో వంశీ ఫోన్ దొరకలేదు. 


వ్యక్తిగత సహాయకుడి ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. 


దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. 


తాజాగా వంశీ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.