మూడు నెలల్లో ఆటోనగర్ లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఆటో మొబైల్ అసోసియేషన్స్ తో సమావేశం
విజయవాడ : ఆటోనగర్ లో ఆటో మొబైల్ రంగం పై ఆధారపడి జీవిస్తున్న లక్షమంది కార్మికులకి మారిన టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం పెంపొందించుకునేందుకు కావాల్సిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఆటోనగర్ లోనే మూడు నెలల్లోనే ఏర్పాటు చేయిస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఆటోనగర్ లో వున్న 32 ఆటో మొబైల్ అసోసియేషన్స్ నాయకులతో ఎంపి కేశినేని శివనాథ్ సమావేశం అయ్యారు. అసోసియేషన్స్ పరంగా డెవలప్ కావటానికి ఏమి కావాలో అడిగి తెలుసుకున్నారు.
అలాగే అసోసియేషన్స్ క్లస్టర్స్ గా ఏర్పడితే కలిగే ప్రయోజనాలు, కేంద్రప్రభుత్వం అందించే సబ్సీడి వివరాలు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నుంచి నిడమానురు వరకు ఫ్లైఓవర్ పనులు, అలాగే మెట్రో పనులు ప్రారంభమైన ఆటోనగర్ లోకి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో జెట్ స్పీడ్ లో అమరావతి పనులు జరగనున్నాయని, ఆ పనులకు ట్రాన్స్ పోర్ట్ చాలా కీలకం..కాబట్టి ఆటో మొబైల్ రంగం ఇందుకు సిద్దంగా వుండాలన్నారు.
ఆటోనగర్ కి వున్న చిన్నచిన్న సమస్యలు కూడా త్వరలోనే ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. ఆటో మొబైల్ రంగంలో వున్న అసోసియేషన్స్ లో వున్న నాయకులు క్లస్టర్స్ గా ఏర్పడాలని సూచించారు. క్లస్టర్స్ గా ఏర్పడితే సంబంధిత అధికారులతో మాట్లాడి లోన్ వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు.క్లస్టర్స్ ఏర్పాటుకి సంబంధించిన స్థలం విషయంలో కూడా సాయం చేస్తానని తెలిపారు. ఆటోనగర్ సిల్క్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా అప్ గ్రేడ్ చెంది, క్లస్టర్ ఏర్పాటు చేసుకుని అభివృద్ది చెందితే ఎంతో మందికి ఉపాది కల్పించే అవకాశం వుంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక మంది యువతకి ఉపాధి చూపించటమే తన ధ్యేయమని..ఆటో మొబైల్ రంగానికి రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు వుంది...అందుకు తగ్గట్టుగా ఆటోనగర్ వర్కర్స్ అందరూ టెక్నికల్ గా అప్ గ్రేడ్ కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసిసోయేషన్ ప్రెసిడెంట్ నాగమోతు రాజా, ఐలా మాజీ చైర్మన్ సుంకర దుర్గా ప్రసాద్, మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంధం వెంకటేశ్వర్లు (కొండ), ఎఫ్.ఐ.పి ప్రెసిడెంట్ నెల్లి వెంకటేశ్వరరావు, పెయింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరాచారి, టైర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బాబా, టింకరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చమట పూర్ణ, ఐలా కో-ఆప్షన్ సభ్యులు బాహుబలేంద్ర కోటేశ్వరరావు, హెచ్.ఎమ్.సి మినీ ట్రక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అసీఫ్ భాషా, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంపర చిన్నారావు, రెడియేటర్స్ యూనిట్ ప్రెసిడెంట్ షేక్ హీదాయుతుల్లా, ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, ఎలక్ట్రీకల్ బ్యాటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవ, కె.హరి, ఆటో ఎలక్ట్రికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్స్ కొడూరు ఆంజనేయ వాసు లతోపాటు పలు అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొననారు.