గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం అడ్డరోడ్డు వద్ద హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తున్న రూరల్ ఎస్ఐ ఎన్ చంటి బాబు*

 **కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం ఫిబ్రవరి 03*


*గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం అడ్డరోడ్డు వద్ద హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తున్న రూరల్ ఎస్ఐ ఎన్ చంటి బాబు*



రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు శరీర భాగాల్లో గాయాలు అయితే..?? తల భాగంలో గాయం అయితే..??


రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యత..


ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ యొక్క ఉపయోగాలు తెలిపిన *ఎస్ఐ ఎన్ చంటి బాబు*


మనిషి శరీరంలోని ఏ భాగానికి గాయం అయినా ప్రాణానికి ప్రమాదం ఉండదు..


కాళ్ళకు పూర్తిస్థాయిలో విరిగినా రాడ్డు సహాయంతో నిలబడవచ్చు,ఒక్క కాలు తీసేసినా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు..


కానీ, తల భాగం చాలా సున్నితమైనది ఏ చిన్న రాయి గుచ్చుకున్నా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయి..


శరీరానికి పెద్ద పెద్ద గాయాలు అయిన తలకి చిన్నపాటి గాయం కాగానే మరణించిన సంఘటనలు చాలానే చూస్తుంటాం..


కొన్ని సందర్భాల్లో ప్రాణం ఉన్న ఆ మనిషి మానసిక పరిస్థితి ముందులాగా ఉండదు,బ్రతికినంత కాలం జీవశ్శవం లాగా బ్రతకలిసి ఉంటుంది. ఇంట్లో ఇంకొకరి మీద ఆధారపడి బ్రతవలసి ఉంటుంది


శరీరం పని చేయడానికి తల భాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది..


కళ్ళు, కాళ్ళు, చేతులు, ప్రతి ఒక్క అవయవం తల వెనక భాగంలో ఉన్న మెదడుకు ముడి పది ఉంటుంది.


హెల్మెట్ పెట్టుకోవడం వల్ల 90% తల భాగాన్ని కాపడవచ్చు..


మనం రోజూ వారి జీవితంలో రహదారులపై ప్రమాదం జరిగినప్పుడు కాళ్ళు చేతులు తల కింద భాగంలో గాయాలు అయితే అట్టి మనిషికి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. తల భాగంలో చిన్న గాయం అయ్యి చెవిలో నుండి రక్త స్రావం జరిగితే ఖచ్చితంగా ప్రమాదమే...


*ఈ రోజు జరిగిన సంఘటన ఓ యువకుడికి విజయవాడలో రహదారిపై ప్రమాదం జరిగితే కేవలం హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాలు దక్కాయి..*


మన నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం..


మీ ప్రాణాల మీద జాగ్రత్త ఎదుటి వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి..


ఎన్ని అవగాహనా సదస్సులు పెట్టినా మీ యొక్క జాగ్రత్త ఉంటేనే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు..


మీరు హెల్మెట్ విలువ తెలుసుకొని ఇంకో పది మందికి తెలియచేయగలరు..