*ప్రచురణార్థం* *01-02-2025*
ఆంధ్ర క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ: విజయనగరంలో జరిగిన రంజీ ట్రోఫీలో రాజస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో అద్బుతమైన విజయం సొంతం చేసుకున్న ఆంధ్ర క్రికెట్ జట్టు ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ అభినందించారు. ఈ మేరకు ఏసీఏ అధ్యక్షుడు ఎంపికేశినేని శివనాథ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్ర క్రికెట్ జట్టు సాధించిన ఈ అద్భుత విజయం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఈ ఏడాది ఆరంభాన్ని గెలుపుతో ప్రారంభించటం చాలా ఆనందంగా వుందన్నారు జట్టులోని ప్రతి ఒక్కరూ అద్బుతమైన తమ ప్రతిభ చూపించటంతో పాటు కృషి, నిబద్ధత ఈ విజయానికి కీలక కారణమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆంధ్ర క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు చెప్పారు. అలాగే ఈ మ్యాచ్‌లో విశేష ప్రతిభ కనబరిచి రెండు ఇన్నింగ్స్ లో కలిపి పది వికెట్స్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన త్రిపురాణ విజయ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆంధ్ర క్రికెట్ జట్టు తమ సత్తా చాటుతూ విజయాలు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఏసీఏ అధ్యక్షుడు ఎంపికేశినేని శివనాథ్ ఆకాంక్షించారు.