భారీ మెజార్టీతో ఎన్డీయే కూటమి ఆలపాటి రాజాను గెలిపించాలి
పశ్చిమంలో ఎన్డీయే కూటమి నాయకుల విస్తృత ప్రచారం
విజయవాడ : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ తొలి ప్రాధాన్యతా ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలంటూ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ నెల 27వ తేదీ జరగబోయే ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల MLC ఎలక్షన్లో NDA కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.నాగుల్ మీరా బుధవారం పశ్చిమ నియోజకవర్గం 47,49,50వ డివిజన్ లో వున్న 5 స్కూల్స్ లో ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేయటం జరిగింది.
ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయుకులు కోగంటి రామారావు,రాష్ట్ర మైనారిటీ జనరల్ సెక్రటరీ ఎమ్.డి. ఫతావుల్లాహ్, రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్ ,49డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ గారు,గుర్రం కొండ ,కామ దేవరాజ్,49వ డివిజన్ అధ్యక్షులు బడుగు వెంకన్న, 50వ డివిజన్ అధ్యక్షులు గంగాధర్ రెడ్డి, సుఖాసీ సరిత,పి.లోకేష్. కుంచం దుర్గారావు,ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షేక్ నాగూర్ లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.