ప్రతిష్ఠాపనలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు.

 అనంతవరంలో వైభవంగా శివాలయ ప్రతిష్ట.

ప్రతిష్ఠాపనలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 03.02.2025.












మైలవరం మండలం అనంతవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతి దేవి సమేత శ్రీ అనంతేశ్వర స్వామి వారి దేవాలయ (శివాలయం) ప్రతిష్టాపన సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల శాస్త్రోక్త మంత్రోచ్ఛారణల నడుమ శివలింగం, ధ్వజస్తంభములను ప్రతిష్టించారు.0

ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, ద్వారకా తిరుమల దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తల మండలి సభ్యులు, లయన్ ఎస్.వి నివృతరావు గారు పాల్గొన్నారు. దేవతా మూర్తులను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.


శివాలయ ప్రతిష్ట సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివాలయ ప్రతిష్ట మహోత్సవాన్ని కమిటీ సభ్యులు కనులపండువగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానికులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.