విజయవాడ --------
స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ నేతలు తుని ఘటన పై ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి , ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్...
*ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్*
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బదులు రాక్షస రాజ్యం నడుస్తుంది
కూటమి నేతల దౌర్జన్యాలు ప్రతీ ఒక్కరు చూస్తున్నారు..
పిడుగురాళ్లలో వారు ఎలా గెలిచారో అందరికీ తెలుసు
వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి తమకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు
ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులను గెలిపించటం కోసం కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి
ఒక్క సభ్యుడు లేకపోయినా టీడీపీ వాళ్ళు ఎలా గెలుస్తున్నారు
అప్రజాస్వామికంగా టీడీపీ వాళ్లు గెలుస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఉంటుందా
సంఖ్యాబలం లేక గెలవటానికి అవకాశం లేకుంటే ఎన్నికలు వాయిదా వేస్తున్నారు
పిడుగురాళ్ల ఎన్నికను రద్దు చేయాలి
జరుగుతున్న పరిణామాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి
*ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి*
రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నాలుగుసార్లు ఎన్నికల కమిషన్ ను కలిశాం..
ఎన్నికల సందర్బంగా జరుగుతున్న పరిణామాలపై ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం..
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది..
ఒక్క సభ్యుడు కూడా లేనిచోట టీడీపీ నేతలు ఎలా పోటీ చేసి గెలుస్తారు
రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఉప ఎన్నికలో అక్రమ మార్గాల్లో గెలవాలని చూస్తున్నారు
ఈ ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా మాకు ఒరిగేదేమీ లేదు
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే మా తాపత్రయం
ప్రజాస్వామ్య గౌరవం కోసమే ఇన్నిసార్లు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేస్తున్నాం
టీడీపీ నేతలు చట్టాన్ని చేతులోకి తీసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు
తునిలో మున్సిపల్ చైర్మన్ ఇంటిని చుట్టుముట్టి దాడి చేశారు
దాడిశెట్టి రాజా రేపు ఛలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చారు
*మాజీ ఎమ్మెల్యే,మల్లాది విష్ణు*
పాలకొండ,పిడుగురాళ్ల,తుని ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యం పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాం
అధికారులను నిద్రావస్థ నుంచి బయటపడేయాలని కోరుతున్నాం
మెజారిటీ లేకుండా...ప్రజాతీర్పు లేకుండా మా పార్టీ వారిని బెదిరించి గెలవాలని చూస్తున్నారు
ఏపీలో గూండా రాజ్యం నడుస్తోంది
సీనియర్ అధికారులు సైతం కనీసం పనిచేయడం లేదు
ఏపీ ప్రజలు ఓటేసి గెలిపించింది దౌర్జన్యాలు చేయడానికేనా
ఏకపక్ష నిర్ణయాలు...అధికారుల ప్రేక్షకపాత్ర అంతా రికార్డెడ్ గా ఉంటుందని గుర్తుంచుకోవాలి
*ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు,దేవినేని అవినాష్*
తునిలో మా నాయకుడి పై దాడి చేశారు
భయపెట్టి దాడులతో గెలవాలని చూస్తున్నారు
ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఏపీలోని పరిస్థితుల పై దృష్టి పెట్టాలి