గన్నవరం నియోజకవర్గంలో వంశీ గారికి మించిన దానకర్ణుడు ఎవరైనా ఉన్నారా?ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నన్ను హౌస్ అరెస్టు చేస్తారా గన్నవరం జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి.
![]() |
గన్నవరం నియోజకవర్గం లో పేదలకు గాని గ్రామాల అభివృద్ధికి గాని గన్నవరం నియోజకవర్గం లో మాజీ యమ్ యల్ ఏ వల్లభనేని వంశీ మోహన్ గారిని మించిన వారు లేరని గన్నవరం జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి అన్నారు. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునని నన్ను రెండవ రోజు హౌస్ అరెస్టు చేసారు. అయినా వాస్తవాన్ని భయట పెడుతూనే ఉంటాను.ఈ సందర్భంగా కొన్ని ఘటనలు ప్రజల దృష్టికి తీసుకురావాలి. కరోనా టైమ్ లో తన స్వంత నిధులతో వందల అక్షిజన్ సిలెండర్లు ఏక్కడ దొరకని సమయంలో ప్రజల అవసరలకు కొని ఇవ్వటం మరియు కరోనా భాధితులకు డబ్బులు లేవని చెపితే హాస్పిటల్ కి తానే చెల్లించినది ప్రజలకు అందరికి తెలుసు.ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు కొరకు లక్షలాది రూపాయలు ఇచ్చారు.పేదలు వివాహాలు, కర్మకాండలకు,వృద్దులకు,వికలాంగులకు,వంశీగారు చేసిన సహాయం నియోజకవర్గం ప్రజలు మర్చిపోలేరు. రైతులకు పట్టిసిమ కాలువ ద్వారా సాగుకు నియోజకవర్గ పరిధిలో మాడిచర్ల నుండి పాతపాడు గ్రామం వరకు ఉన్నా అన్నిగ్రామాలకు తన స్వంత నిధులతో మోటార్లు కొని ఇచ్చిన విషయం,ప్రజలు మంచినీరు కొరకు కొన్ని గ్రామాలలో వాటర్ ప్లాంట్లు నిర్మించిన విషయం,గన్నవరం విమానశ్రాయం కొరకు భూ సేకరణలో రైతులను ఒప్పించటం లో కీలక పాత్ర వాహించినది, పోలవరం పట్టిసిమ కాలువ తోవ్వకంలో పనులు చేయటానికి కావాలసిన వాహనాలు సరఫరా చేసిన సహాయంలో, మల్లవల్లి పారిశ్రామిక ఏర్పాటుకు అక్కడ రైతులను వప్పించి ఆ పారిశ్రమకు చేసిన కృషి, గన్నవరం నియోజకవర్గం లో ప్రజలు మర్చిపోలేరు. అటువంటి వంశీగారి పై నిందలు మోపటం జైలుకు పంపటంపై రెడ్ బుక్ ప్రభుత్వంపై ప్రజలు చీకొడుతున్నారు.అని అన్నారు.వంశీ గారు కడిగిన ముత్యాంలాగా బయటకు వస్తారని ఆమే అన్నారు. నన్ను రెండు రోజుల నుండి ప్రభుత్వం పోలీసులతో హౌస్ అరెస్టు చేయటాన్ని నేను త్రివరంగా ఖoడిస్తున్నాను.