శభాష్ ఖాకీ...ఇది కదా డ్యూటీ అంటే..*

 *శభాష్ ఖాకీ...ఇది కదా డ్యూటీ అంటే..*

చుట్టూ చీకటి..

అర్థరాత్రి 11.21

అతి తక్కువ సమయం..



రెండు జిల్లాల దూరం...

కాపాడాల్సిన ఒక నిండు ప్రాణం...

మూడు ఖాకీలు ఒక్కటైన తరుణం..

ఆపై విజయం...


 " 6 నిమిషాల్లో అయినవిల్లి నుంచి అన్నవరం ".


సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తిని 6 నిమిషాల్లో కాపాడిన పోలీసులు.


 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కు చెందిన యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయేందుకు సిద్ధమైన వైనం...


  వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంకు చెందిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో చనిపోదామని నిర్ణయించుకున్నాడు.


 ఆ తర్వాత తనకు కావలసిన బంధువులకి సెల్ఫీ వీడియో పెట్టి ఉరి వేసుకుని చనిపోదామని నిర్ణయించుకున్న సమయంలో పి.గన్నవరం సీ.ఐ భీమరాజుకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే అతను ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేయడం కోసం ఐటీ కోర్ లో పనిచేస్తున్న జాఫర్ కు పంపించడం జరిగింది.


 వెంటనే స్విచ్ ఆఫ్ లో ఉన్న మొబైల్ ను క్రెడియన్షియల్స్ ఉపయోగించి సెల్ ఐడి తో లాస్ట్ లొకేషన్ ను కనుగొన్న జాఫర్.


 వెంటనే ఆ లొకేషన్ ను సీ.ఐ భీమరాజుకు షేర్ చేయడం జరిగింది.


 వెంటనే ఆ లొకేషన్ చూసిన సీ.ఐ భీమరాజు కాకినాడ జిల్లా అన్నవరంలో లొకేషన్ రావడంతో వెంటనే అన్నవరం ఎస్సై శ్రీహరి గారిని లైన్ లోకి తీసుకోవడం జరిగింది.


 అన్నవరం ఎస్ఐ శ్రీహరి వెంటనే వాళ్ళ సిబ్బందిని ఆ లొకేషన్ కి పంపించడంతోపాటు ఆ వీడియో వెనకాల ఉన్న రూమ్ లాడ్జి రూమ్ లాగా అనిపించడంతో అన్నవరంలో ఉన్న లాడ్జి ఓనర్స్ గ్రూపులో దాన్ని షేర్ చేసి వాళ్లందర్నీ కూడా అలెర్ట్ చేయడం జరిగింది.


 వెంటనే ఒక లాడ్జ్ యజమాని అతడిని గుర్తించి సరిగ్గా ఉరివేసుకొని సమయంలో తలుపు బద్దలు కొట్టి అతన్ని కాపాడడం జరిగింది. 


 ఈ మొత్తం వ్యవహారం అంతా రాత్రి 11:21 నుంచి 11:27 మధ్యలో కేవలం ఆరు (6) నిమిషాల వ్యవధిలోనే జరగడంతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం జరిగింది. 


ఈ యొక్క ప్రయత్నంలో విజయం సాధించి ఆ వ్యక్తిని కాపాడిన సీ.ఐ భీమరాజుకి గారికి, అన్నవరం ఎస్.ఐ శ్రీహరి గారికి, ఐ.టీ కోర్ కానిస్టేబుల్ జాఫర్ గారికి గ్రామస్తులు, సెటిజెన్స్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు...