మధ్య తరగతి ప్రజలకు అండగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ పై అవగాహన సదస్సు ఏర్పాటు
విజయవాడ : ప్రతి కుటుంబంలో ఒకరు ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాన్ని ఎన్టీఆర్ జిల్లాలో ముందుకి తీసుకువెళ్లేందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME) ద్వారా లోన్స్ తీసుకుని మధ్య తరగతి ప్రజలు పారిశ్రామికవేత్తలు గా ఏ విధంగా మారవచ్చు అనే అంశం పై ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు బుధవారం తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ మొఘల్ రాజపురం లోని శివాలయం వద్దగల టిడిపి కార్యాలయంలో ప్రజలకు అవగాహన సదస్సు జరిగింది.
ఈ సదస్సులో నాయకులు మాట్లాడుతూ మద్య తరగతి ప్రజలందరూ ఆర్థిక స్వాలంబన సాధించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ఏ విధంగా తీసుకోవాలి..ఏ యూనిట్స్ ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఉపయోగం వుంటుందో వివరించారు. అలాగే ఈ లోన్స్ కోసం దరఖాస్తు చేసుకునే దగ్గర నుంచి బ్యాంక్ నుంచి లోన్స్ అందుకునే వరకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పారిశ్రామికవేత్తలుగా మారాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పటమట సతీష్ చంద్ర, డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండపల్లి లక్ష్మణరావు, ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సంకే విశ్వనాథం, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగా సంజయ్ వర్మ, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి దోమకొండ రవికుమార్, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జునయాదవ్, డివిజన్ ఉపాధ్యక్షుడు పెనుకొండ శ్రీనివాస్, టిడిపి నాయకులు కిళ్లీ తవిటయ్య లతో పాటు బూత్ కన్వీనర్లు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.