చిలకలూరిపేట లో కానరాని MLC ఎన్నికల కోడ్
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వైన్, బార్ అండ్ రెస్టారెంట్ల్లో క్యాటర్ మద్యం బాటిల్ మీద రూ.30 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. దానికి తోడు మహాశివరాత్రి పండుగ కావడంతో మద్యం ప్రియులు వైన్ షాపులపై ఎగబడడంతో విచ్చలవిడిగా దోపిడీకి తెర లేపారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిసే జరుగుతుందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైన్ షాపులు సిలు వేసినప్పటికీ ఎక్కడ మద్యం అమ్మకాలు నిలుపుదల చేయలేదు... దీనిని బట్టి ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పలువురు విమర్శిస్తున్నారు.