*ఘనంగా గుణదల మేరీ మాత ఉత్సవాలు*
దేశంలో ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రాలలో విజయవాడ గుణదల మేరీ మాత పుణ్య క్షేత్రo ఒకటని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు.ఈ సందర్భంగా బిషప్ జయరాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి అవినాష్ ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో తాను భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి హయం నుంచే ప్రతి ఏటా తమ కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు లో పాల్గొనటం జరుగుతుంది అని చెప్పారు.100 సంవత్సరాలుగా పుణ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా మహోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. మేరీ మాత ఆశీస్సులతో వైసీపీ జాతీయ అద్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్లు నిర్మలాకుమారి,మాధురి,అంబేద్కర్,సీనియర్ నాయకులు డేవిడ్ రాజు,చిన్నబాబు,అగస్తీన్, భీమిశెట్టి బాబు,చందా కిరణ్,కిస్సి వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.