మాధురి పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట అక్షర అభ్యాసం
మండల కేంద్రంలోని పుల్లారెడ్డి గారి పల్లి రోడ్డు లో ఉన్న మాధురి ఉన్నత పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా పాఠశాల ఆవరణంలో సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేద పండితులతో నిర్వహించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రేపన సుధాకర్ పాల్గొని సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతి దేవి చదువుల తల్లి అని పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని ప్రతి విద్యార్థి సరస్వతీదేవిని పూజించే పాఠశాలకు వెళ్లాలని ఆయన సూచించారు అనంతరం విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల అక్షరాభ్యాసంలో వారి తల్లులు పాల్గొన్నారు.