వీళ్ళు మనుషులా...
-సమగ్ర విచారణ జరపాలి..
-వీరీని వెంటనే అరెస్టు చెయాలి..
-వీరిపై ఫోక్సో చట్టం... బాల హక్కుల సంరక్షణ చట్టం క్రింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాము..PAAP
-రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు వసతి గృహాలలో మా బిడ్డ లు ఎదుర్కొంటున్న సమస్యలపై మండల జిల్లాస్థాయిలో ప్రభుత్వ విభాగాలతో దర్యాప్తు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి...
-దర్యాప్తు నివేదిక శ్వేత పత్రం విడుదల చేయాలి..PAAP
శానిటరీ ప్యాడ్స్ అడిగితే పీరియడ్స్ వచ్చినట్లు ఆధారం చూపించమంటున్నారు’.. కేజీబీవీ విద్యార్థినిలు ...
అన్నమయ్య జిల్లా మొలకల చెరువు సమీపం లోని
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తనిఖీకి వెళ్లిన అధికారులకు అక్కడ చదువుకుంటున్న విద్యార్థినులు కన్నీళ్లతో తమ బాధలు చెప్పుకోవడం, స్కూల్లో తమను వేధిస్తున్నారని ఆరోపించడం కలకలం సృష్టించింది.
నెలసరి సమయంలో అమ్మాయిలకు 5 ప్యాడ్లు ఇస్తున్నట్లు రిజిస్టర్‌లో రాస్తున్నారు. కానీ, తమకు రెండు మాత్రమే ఇస్తున్నట్లు పిల్లలు చెబుతున్నారు. నెలసరి వచ్చినప్పుడు తలస్నానం చేసే సమయంలో ప్రతి విద్యార్థిని నుంచి రూ. 100 అడుగుతున్నారని తెలిసింది. ఆహారంలో నాణ్యత ఉండట్లేదు. ఎవరైనా తనిఖీలకు వచ్చిన సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు. మిగిలిన సమయంలో సరిగా ఉండటం లేదు. మెనూ ప్రకారం కూడా పెట్టడం లేదు'' అని సరిత తెలిపారు.
ఒకవేళ విద్యార్థినుల్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని వేధిస్తున్నారంటూ స్కూల్లో చదివే బాలికలు తమకు చెప్పారని సరిత అన్నారు.
పిల్లలకి ఆరోగ్యం బాలేకపోతే, ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఒకే టాబ్లెట్ ఇస్తున్నారు. ఏఎన్ఎం తమను కొడతారని, తిడతారని పిల్లలు ఫిర్యాదు చేశారు. ఒకసారి ఒకమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు సూది లోపలే ఉండిపోవడంతో ఆమె ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. తర్వాత, ఇంటికి వెళ్లి ఆమె చికిత్స తీసుకున్నారు. ఏమైనా వీరు కేవలం పారాసిటమాల్ ఇస్తారని పిల్లలు మాతో చెప్పారు'' అని సరిత వివరించారు.
ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, కుటుంబీకులు కూడా ఇవే ఆరోపణలు చేశారు. పిల్లలకు ఆరోగ్యం బాలేకపోతే తమతో స్కూల్ సిబ్బంది చెప్పనివ్వరని, ఏ సమస్య అయినా బాగా ముదిరిన తర్వాత తమ వరకు వస్తుందని ఒక విద్యార్థిని నాన్నమ్మ సుబ్బమ్మ చెప్పారు.
''పిల్లలకు ఆరోగ్యం బాలేకపోయినా పట్టించుకోరు. ఒక మాత్ర ఇస్తారు. మాకు చెప్పరు. ఫోన్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది అంటారు. మేం కలవడానికి వెళ్లినప్పుడు బిడ్డ కుమిలిపోయింది. ఇంటికి తీసుకెళ్లి రూ.3000 ఖర్చు పెట్టి ఆసుపత్రిలో చూపించాం. తిండి కూడా సరిగా పెట్టరు. మేం స్నాక్స్ ఇచ్చి వెళ్తుంటాం. ఏ సౌకర్యం లేనప్పుడు ఈ హాస్టల్ ఎందుకు? దయచేసి ఆడబిడ్డల భవిష్యత్తు నిలపండి'' అని ఆమె అన్నారు.
భోజనం సరిగా లేదని చెబితే, మీ ఇంట్లో ఇంకా బాగా పెడతారా అని పిల్లలపై కోప్పడతారని, కొట్టడానికి వస్తారని తన మనవరాలు చెప్పిందని సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నంలో పురుగులు వస్తున్నాయని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఏఎన్ఎం మీద కూడా కంప్లైంట్ వచ్చింది. ప్యాడ్స్ అడిగితే ప్రూఫ్ ఏది చూపించు అని అడుగుతారంటా. ఆడపిల్లని అలా అడగడం చాలా తప్పు. దీనిపై కూడా మేం ఫిర్యాదు చేశాం. అయినా మళ్లీ అలాగే జరుగుతోంది.
హాస్టల్ సిబ్బంది అభ్యంతరకర రీతిలో మాట్లాడతారని పిల్లలు చెబుతుంటారు. పిల్లలతో చెత్త తీయించడం, అంట్లు కడిగించడం వంటి పనులు చేయిస్తారు. వాళ్ల మాట వినకపోతే సరిగా చదవడం లేదని తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయడం, కాళ్లు నొక్కించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడైనా న్యాయం చేయండి. హాస్టల్‌లో సిబ్బందిని మార్చండి'' అని ఆవేదన చెందారు.
అన్నమయ్య జిల్లా మొలకల చెరువు సమీపం లోని
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తనిఖీకి వెళ్లిన అధికారులకు అక్కడ చదువుకుంటున్న విద్యార్థినులు కన్నీళ్లతో తమ బాధలు చెప్పుకోవడం, స్కూల్లో తమను సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపించడం పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని బోధన బోధనేతర సిబ్బంది ఫోక్సో చట్టం.. బాలల హక్కుల సంరక్షణ చట్టం కింద కేసులు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము ..
అక్షరం ఓ ఆయుధం... ఇదే మా పిల్లల భవిష్యత్ .. భవితవ్యం..".
*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్*
*(రిజిస్టర్ నెంబర్ 6/2022)*
*ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.*
*_For more information please join with PAAP_*
https://chat.whatsapp.com/J0MhpJezt5z9rFDy22ob3I