పేద ప్రజల అణగారిన వర్గాల వారిని పరిశీలించడానికి ఈరోజు T. సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలోని తోటి హరిజనవాడ. ప్రజలను పలకరించి వారి దగ్గర నుండి నీటి సమస్యలు, రోడ్డు సమస్యలు,విద్య సమస్యలు, యువతకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని అడిగి తెలుసు కున్నారు బడి గురించి అంగన్వాడి గురించి గుడికి ఉన్న సమస్యల గురించి మంచినీటి సరఫరా గురించి ట్యాంకు గురించి పెద్దవారి పెన్షన్ల గురించి భూ తగాదాలు ఏమైనా ఉన్నాయా ఎస్సీలకు కేటాయించిన భూముల్లో ఏ సమస్య లైలా ఉన్నాయా అంటూ ఆరా తీశారు అనేక సమస్యలను ప్రజల వద్ద నుండి తెలుసుకున్నారు గుడికి స్థలం కేటాయించి సర్టిఫికెట్ ఇస్తానని చెప్పారు.
సమస్య వచ్చినా నా దగ్గరకు రండి అంటూ గ్రామ ప్రజలతో కలిసి ఊరంతా తిరిగారు రోడ్లను పరిశీలించారు మంచినీటి సరఫరా పైపులను పరిశీలించారు పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే ముఖ్యంగా మీ భూ సమస్యలు ఏవైనా ఉన్న నా దగ్గరికి తీసుకురండి నేను పరిష్కరిస్తానంటూ గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వారి వారి భూముల గురించి వన్ బి రావడం లేద ని తాసిల్దారు వారికి విన్నవించారు ప్రజలు.