చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్ధులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది - వెలంపల్లి*

*ఫిబ్రవరి 5న జరిగే ఫీజ్ పోరును జయప్రదం చేయండి - వెలంపల్లి*


*ఫీజ్ పోరు గోడ పత్రికను ఆవిష్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి*


*పాల్గొన్న నగర మేయర్, పశ్చిమ నియోజకవర్గ వైకాపా కార్పొరేటర్లు, నాయకులు*



*చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్ధులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది  - వెలంపల్లి*


*ఫీజ్ రియంబర్స్ మెంట్ పధకాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు  - వెలంపల్లి*


*మన పిల్లల తలరాతలు మార్చాలంటే చదువుతోనే సాధ్యమని నమ్మిన వ్యక్తి జగన్  - వెలంపల్లి*


*నాడు నేడు పనులను అటకెక్కించి స్కూల్ ల అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అడ్డుకుంది - వెలంపల్లి*


ఫిబ్రవరి 5న జరిగే ఫీజ్ పోరును జయప్రదం చేయాలనీ కోరుతూ శనివారం నాడు మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్ధులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు. రాక్షసత్వంతో ఫీజ్ రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా పెద్ద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. విద్యార్థులు ఫీజ్ లు కట్టలేని పరిస్థితులలో కాలేజ్ యాజమాన్యాలు పిల్లలను వెళ్లగొడుతుంటే తల్లి దండ్రులు దిక్కుతోచలేని స్థితిలో నిలబడుతున్నారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫీజ్ రీయంబర్స్మెంట్ పధకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు ఫీజ్ రీయంబర్స్మెంట్ పధకాన్ని నిర్వీర్యం చేసారని గుర్తుచేశారు. 2014 - 2019 మధ్యలోనే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా అటు యాజమాన్యాల ఇటు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారన్నారు. తన తండ్రి బాటలో వైయస్ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసి 93 శాతం మంది పిల్లలకు మేలు చేశారన్నారు. మన పిల్లల తలరాతలు మార్చాలంటే చదువుతోనే సాధ్యమని నమ్మిన జగన్ ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, అమ్మఒడి, గోరు ముద్ద వంటి పధకాలను ప్రవేశ పెట్టి అమలు చేసారన్నారు. గత విద్య సంవత్సరంలో డిసెంబర్ త్రైమాసికం వరకు జగనన్న ప్రభుత్వంలో విద్యా దీవెనకే 12 వేల 6 వందల 9 కోట్లు ఖర్చు చేసారన్నారు. పేద విద్యార్థుల పట్ల వైయస్ జగన్ కి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అమ్మఒడి ఇంగ్లిష్ మీడియం మూడో తరగతి నుంచి టోఫెల్ మూడో తరగతి నుంచి సైబ్జెక్టు టీచర్ ను కూడా రద్దు చేశారన్నారు. 8 తరగతి పిల్లలకు టాబ్ లు, బైజూస్ కంటెంట్ లు కూడా లేవన్నారు.  నాడు నేడు పనులను అటకెక్కించి స్కూల్ ల అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అడ్డుకుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 2 వేల 8 వందల కోట్లకు పైగా ఫీజ్ రీయంబర్స్మెంట్ పెండింగ్ లో ఉందని మరో 11 వందల కోట్లు వసతి దీవెన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గతంలో చంద్రబాబు 2019 లో దిగిపోతూ 2 వేల 8 వందల కోట్లు ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ లో పెట్టారన్నారు. మధ్యాహ్న భోజన బకాయిలు 148 కోట్లు పెడితే జగనన్న ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం పై నిందలు వేయకుండా ఆ బకాయిలను తీరుస్తూ వచ్చారని గుర్తు చేసారు. రానున్న రోజులో పెండింగ్ లో ఉన్న ఫీజ్ రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించని యెడల లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు బారి మూల్యం చెల్లించక తప్పదన్నారు. 


ఈ కార్యక్రమంలో వైసిపి కార్పొరేటర్లు  యరడ్ల ఆంజనేయ రెడ్డి, షేక్ ఇర్ఫాన్, బాపతి కోటిరెడ్డి, యలకల చలపతిరావు, నాయకులు డివి రెడ్డి, పెద్ది సాయి, సరగడ శంకర్ రెడ్డి, కూరాకుల నాగ, పిళ్ల సూరిబాబు (జగ్గు), గౌడిపేరు సుధీర్, తుపాకుల గురుమూర్తి రెడ్డి, గురుమహంతు మహేష్ తదితరులు పాల్గొన్నారు