చిలకలూరిపేట నియోజకవర్గంలో గడియార స్తంభం నుంచి బ్రహ్మంగారి గుడి మీదుగా ఓగేరు వాగు పైన సుమారు 6:30 కోట్ల రూపాయల వ్యయంతో ప్రజల కొరకు నిర్మించిన బ్రిడ్జి ఇంతవరకు శంకుస్థాపనకు నోచుకోలేదు..
అదేవిధంగా నిరంతరం తాగుబోతులకు కేంద్రంగా ఉండి... ప్రభుత్వ పర్యవేక్షణ లేక పోవడంతో ఆ ప్రాంతమంతా కూడా పగలు రాత్రి తేడా లేకుండా మందుబాబులు, గంజాయి బ్యాచి మందు గంజాయి సేవిస్తూ ఆ ప్రాంత పంట పొలాలను ధ్వంసం చేస్తూ, అదేమని అడిగితే రైతులు పై తిరగబడుతూ, తాగి పంట పొలాల్లోనే సీసాలు పగలగొట్టి రైతాంగాన్ని మనస్థాపానికి గురి చేస్తున్నారు... పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇష్టంగా ఆ ప్రాంతంలో రెండు సెంట్లు మూడు సెంట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటామనుకుంటే మందుబాబులు దెబ్బకి ఆ ప్రాంతానికి రావడానికి భయపడే విధంగా ఉంది.. కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఒగేరు వాగు బ్రిడ్జిని ప్రారంభించి, బ్రిడ్జి నుంచి గడియార స్తంభం వరకు రహదారి నిర్మించి, ఆయా ప్రాంత ప్రజల మనోభావాలను కాపాడాలని ప్రభుత్వ ధనం ప్రజాదనంగా భావించి వృధా కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు..