36వ రహదారి భద్రత వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా

 పత్రిక ప్రకటన

డీటీసీ కార్యాలయం, విజయవాడ. తేదీ 06.02.2025




36వ రహదారి భద్రత వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మేరీస్ స్టెల్లా కళాశాలలో గురువారంనాడు విద్యార్థులతో రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐపీఎస్ ట్రైనింగ్ అధికారిని మనీషా రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ లత కుమారి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఏ మోహన్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సిస్టర్ రేఖ  డైరెక్టర్ ఎక్సటెన్సిన్ యాక్టివిటీస్ ,ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఐపీఎస్ ట్రైనింగ్ అధికారిని మనీషా రెడ్డి మాట్లాడుతూ నేడు విద్యార్థుల చేతుల్లోనే దేశం  పురోగతి ఉందని, విద్యార్థులు నైపుణ్యంతో ముందుకు వెళ్లాలని, నిర్లక్ష్యంగా వాహనాల నడిపి రోడ్డు ప్రమాదాలతో మరణించరాదన్నారు.. విద్యార్థులు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాల తగ్గించగలమన్నారు.


అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ లత కుమారి మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ వాడుతూ డ్రైవ్ చేయటం చట్ట ప్రకారం నేరమని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల ఏకాగ్రత కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశం వుంటుందని అన్నారు. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడాల్సిన అవసరం వచ్చినట్లయితే వాహనంను ప్రక్కకు ఆపి మాట్లాడలే తప్ప డ్రైవింగ్ చేస్తూ మాట్లాడరాదన్నారు. మీరు చేసే తప్పిదాల వలన ఇతరులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందన్నారు.

విద్యార్థులే ఎక్కువ స్పీడ్ తో వెళ్ళడం, ఇద్దరు కంటే ఎక్కువ మంది బైకులు మీద ఎక్కి ఎక్కడం గమనిస్తున్నమన్నారు. అతివేగం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలని, మితిమీరిన వేగంతో వెళ్లొద్దని ఆమె కోరారు.


డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్  ఎ. మోహన్  మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా శాతం హెల్మెట్ ధరించటం పోవడం వలన జరిగిన రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో చూడాలనుకుని చదివిస్తున్నారని కానీ కొందరు నిర్లక్ష్యాల వలన రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కొట్టుకుంటున్నారన్నారు. సెల్ ఫోన్ మాట్లాడడం, అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్  సీటు బెల్ట్ ధరించి వాహనాలు నడపకపోవడం ప్రమాదాలకు కారణాలని ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే అది యువతకి సాధ్యమని ఆయన అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ రీజినల్ మేనేజర్ శ్రీ యేసు దానం మాట్లాడుతూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించటం వల్ల సురక్షితం గా ప్రయాణం కొనసాగించవచ్చునని ఆయన తెలిపారు.


ఈ కార్య క్రమం లో దిశ పోలీసు ఇన్స్పెక్టర్ వాసవి, మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్సామ్రాజ్యం,డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఉష కుమారి ,ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, అధ్యాపకులు, 500 మంది విద్యార్థినులు ఆర్టీఏ అధికారులు సిబ్బంది  పాల్గొన్నారు