1991 బ్యాచ్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించు బ్యాట్మెంటన్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్

 *ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ*

 పత్రికా ప్రకటన  తేదీ 09.02.2025






 *1991 బ్యాచ్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించు బ్యాట్మెంటన్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ గారు* 


 ఈ మధ్యకాలంలో అత్యధికంగా జరుగుతున్న సైబర్ నేరాలను ప్రజలకు అవగాహన ద్వారానే ఈ సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడతారని నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ వి రాజశేఖర బాబు ఐపీఎస్ గారు వినూత్నంగా నగరంలో సైబర్ సేఫ్టీ పై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినారు.


 ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ గారి ఆలోచనలను పునికి పుచ్చుకున్న 1991 బ్యాచ్ కి చెందిన పోలీస్ అధికారులు అందరూ కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో   సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం నందు ఎన్టీఆర్ మరియు కృష్ణ జిల్లాలకు చెందిన క్రీడాకారులతో బ్యాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.


 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజశేఖర బాబు ఐపీఎస్ గారు పాల్గొని బ్యాట్మెంటన్ టోర్నమెంట్ ను ప్రారంభించినారు. ఈ నేపథ్యంలో సరదాగా కాసేపు బ్యాట్మెంటన్ ఆడినారు.


 ఈ టోర్నమెంట్ కు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 84 జంటలు వివిధ విభాగాల్లో పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా 11,111/- రూపాయలు, రెండవ బహుమతిగా 7,777/- రూపాయలు, మూడవ బహుమతిగా 4,444/- మరియు నాలుగో బహుమతిగా 2,222/- అందించడం జరుగుతుంది.


 అనంతరం నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజశేఖర బాబు ఐపిఎస్ గారు మాట్లాడుతూ..... ఈ  1991 బ్యాచ్ కి చెందిన పోలీస్ అధికారులు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 34 సంవత్సరాలు తర్వాత కూడా వీరికి ట్రైనింగ్ ఇచ్చిన అధికారి శ్రీ జయంతి రావు గారు మరణించిన సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటూ వారిని స్మరించుకుంటూ అనాధ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా 34 సంవత్సరాలు సర్వీసులో ఆరోగ్యపరంగా పోలీస్ సిబ్బంది పడుతున్న బాధలను గమనించి పోలీస్ పోలీస్ కుటుంబాలకు ఆరోగ్యపరంగా ఏదైనా చేయాలని ఉద్దేశంతో నగరంలోని వివిధ హాస్పిటల్స్ వారితో మాట్లాడి పోలీస్ సిబ్బందికి హెల్త్ కార్డులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసినారు అదే విధంగా ప్రజలకు సైబర్ నేరాలపై  అవగాహన కల్పించాలని సదుద్దేశంతో ఈరోజు ఈ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో పోలీసులపై మరింత గౌరవం పెరిగి ఫ్రెండ్లీ పోలీసింగ్ కి విలువ తీసుకొస్తున్నారని తెలియజేశారు. ఈ విధంగా ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.


 ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ వి రాజశేఖర బాబు ఐ. పి. ఎస్. గారితో పాటు ఎ. డి. సి. పి. ప్రసన్న కుమార్ గారు, 1991 బ్యాచ్ పోలీస్ అధికారులు శ్రీ పివి మారుతీ రావు గారు, శ్రీ దామోదర్ రావు గారు, శ్రీ రవికాంత్ గారు, శ్రీ సుభాకర్ గారు, శ్రీ సత్యానందం గారు, శ్రీ వంశీధర్ గౌడ్ గారు, శ్రీ ధర్మేంద్ర గారు, శ్రీ రాజీవ్ కుమార్ గారు, శ్రీ పి.భాస్కర రావు గారు, శ్రీ రఘురాం మోహన్ గారు, శ్రీ విజయ భాస్కర్ గారు, శ్రీ వర్మ గారు, శ్రీ కిషోర్ గారు, శ్రీ డి ప్రసాద రావు గారు, ఆర్. ఐ. లు శ్రీనివాసరావు, రాజ శేఖర్, గార్లు, రవి తేజ గారు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.



****