*కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన మేలును మరిచిపోలేను*
*రోజూ లెక్కలు చెబుతూ రూ.1400 కోట్లు ఇచ్చిన నా తోడేరు బ్రోని ఎలా మరిచిపోగలను*
*ముత్తుకూరు మండలం వల్లూరు పర్యటన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్*
సాధారణంగా అందరూ వెంకటేశ్వర సుప్రభాతం విని దినచర్య ప్రారంభిస్తారు. నాకు మాత్రం నా బ్రో తోడేరు రెడ్డి తిట్ల సుప్రభాతంతో రోజు ప్రారంభమవుతుంది
ఏమో పాపం వారం రోజుల నుంచి తిట్ల దండకం ఆపేసివున్నాడు.
నన్ను తిడుతున్నందుకే ఆయనకు జగనన్న జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు
జిల్లా అధ్యక్షుడయ్యాడు కదా...జిల్లాలో అందర్ని తిడతాడనుకున్నా...కానీ నా ఒక్కడిపైనే తిట్ల దండకం సాగిస్తున్నాడు
రోజూ సంపాదన లెక్కలు చెబుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డి నాకు చేసిన సాయం మరిచిపోలేను..
విదేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులిచ్చాడు..ఇసుకలో నా కొడుక్కి రూ.200 కోట్లు ఇచ్చారు..బూడిదలో ఒక రూ 100 కోట్లు, ఇరిగేషన్ పనులు, బ్రాందీషాపుల్లో ఇంకో రూ.100 కోట్లు
అంతా కలిపి రూ.1400 కోట్లు ఇచ్చిన కాకాణిని ఎలా మరిచిపోగలను