_ఎన్టీటీపీఎ‌స్ వికృత క్రీడ.. మైలవరం నియోజకవర్గంలో 104 గ్రామాలకు తాగునీటి సరఫరా బంద్_

 *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

*_ఎన్టీటీపీఎ‌స్ వికృత క్రీడ.. మైలవరం నియోజకవర్గంలో 104 గ్రామాలకు తాగునీటి సరఫరా బంద్_*







*_ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యం.. లెక్కలేనితనం వల్ల తాగునీటికి అల్లాడుతున్న ప్రజలు_*


*_ప్లాంట్ నుంచి విడుదలవుతున్న బూడిద నీటిని కాలువ ద్వారా కూలింగ్ కెనాల్ లో కలుపుతున్న అధికారులు_*


*_కూలింగ్ కెనాల్ నుంచి పంప్ హౌస్ కు వచ్చే నీటిలో బూడిద కలిసి బ్లాక్ అయిన ఫిల్టర్ బెడ్_*


*_గత రాత్రి నుంచి నీటి శుద్ధిని నిలిపివేసిన ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు_*


*_సుమారు 27.9 ఎంఎల్ డబ్ల్యు నీటి సరఫరా నిలిపివేత_*


*_గాలి కాలుష్యంతో పాటు ఎన్టీటీపీఎస్ అధికారులు నీటిని కూడా కలుషితం చేస్తున్నారని మండిపడుతున్న ప్రజలు_*


*_బూడీద నీరు కూలింగ్ కెనాల్ లో కలవడం ఆగే వరకు ఫిల్టర్ బెడ్ లు పనిచేయవంటున్న అధికారులు_*


*_ఫిల్టర్ బెడ్ ను పునః ప్రారంభించి గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలంటే మరో రెండు రోజులు పట్టే అవకాశం_*


*_చేష్టలుడిగి కూర్చున్న అధికార యంత్రాంగం_*


*_ఎన్టీటీపీఎస్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేదెవరు? బూడిద నీటిని అరికట్టేదెవరు? అని ప్రశ్నిస్తున్న పరిసర గ్రామాల ప్రజలు_*


*_ఇప్పటికైనా కళ్లు తెరిచి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి_*