ఏపీ రాజకీయాలలో గేమ్ ఛేoజర్ నారా లోకేష్

 *ఏపీ రాజకీయాలలో గేమ్ ఛేoజర్ నారా లోకేష్...* 

 విజయవాడ.....

 సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి 42వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడమైనది..





 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా:- టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  పాల్గొని కేక్ కట్ చేసి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..



  బొండా ఉమా కామెంట్స్..


 ఈరోజు మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు అన్నదానాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని...


 ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం యువ వయసులోనే కష్టపడి పార్టీకి కార్యకర్తలకు అండగా నిలుస్తూ నిరంతరం పార్టీ కోసం కష్టపడి పార్టీని గెలిపించడమే కాకుండా, భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్న  నారా లోకేష్  1 కోటి సభ్యత్వాలు చేయించారని..


గత పాలకుల అసమర్ధత, అవినీతి వలన ఆర్థికంగా ,సామాజికంగా, రాజకీయంగా విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి యువగళం పాదయాత్రతో జన హృదయాలు గెలిచి తెలుగుదేశం పార్టీని విజయతీరాలకు చేర్చి, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే HCL, గూగుల్ క్లౌడ్, టీసీఎస్ వంటి దిగ్గజాలను రాష్ట్రానికి తీసుకువచ్చి ఆంధ్రాకు ఐటీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన నారా లోకేష్  రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నారా లోకేష్ గారు ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్లాలని బొండా ఉమా  తెలియజేశారు...


 ఈ కార్యక్రమంలో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్, పైడి శ్రీను, బత్తుల కొండ, SK బాషా, బెజ్జం జైపాల్, దాసరి ఉదయశ్రీ, వేల్పుల రాజేష్, మాచర్ల గోపి, చింతల దుర్గాప్రసాద్, ఆరుమళ్ళ గోపిరెడ్డి, కేబుల్ రాజా,SK గౌసియా, SD గౌసియా,సావిత్రి, శృతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు....