కృష్ణాజిల్లా
పెనమలూరు నియోజకవర్గం .
గోసాల శ్రీ చైతన్య కాలేజీ అరాచకం..
అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా విద్యార్థిని నడిరోడ్డుపై గెంటివేసిన యాజమాన్యం..
చార్జీలకు డబ్బులు లేక 112 కి ఫోన్ చేసిన తల్లిదండ్రులు..
నడిరోడ్డుపై జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు..
ఫీజు కట్టలేదన్న నెపంతో అర్ధరాత్రి విద్యార్థిని బయటికి పంపిన కళాశాల యాజమాన్యం .
కంకిపాడు గోశాల-కంకిపాడు సమీపంలో శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆబోతు గౌతం.
సంక్రాంతి సెలవులు ముగించుకొని తండ్రితో కలిసి హైదరాబాదు నుంచి రాత్రి కళాశాలకు చేరుకోగా..
ఫీజు చెల్లించాలని యాజమాన్యం చెప్పడంతో రాత్రి 20000 ఫీజు చెల్లించిన తండ్రి ఆబోతు టార్జాన్ .
మిగతా ఫీజు కూడా కడితేనే కళాశాలలోకి అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో తన దగ్గర లేవని ఎంత వేడుకున్నా యాజమాన్యం కనికరించలేదని వాపోతున్న తండ్రి.
అర్ధరాత్రి కాలేజీ ముందు బైఠాయించి నిరసన తెలిపిన తండ్రి కొడుకులు..
112 కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు .
*బాధితుడి తండ్రి మాట్లాడుతూ..*
తాను కూడా హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నానని పిల్లల పట్ల యాజమాన్యం ఇంత కఠినంగా వ్యవహరించడం తగదని..
ఈరోజు 20000 ఫీజు కట్టగా మిగతా బకాయి కూడా చెల్లిస్తేనే కాలేజీలోకి అనుమతిస్తామని చెప్పారు.
ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఇంటర్ పరీక్షలు ఉండగా ఈలోపు మిగతా బకాయి చెల్లిస్తానని చెప్పిన యాజమాన్యం వినలేదని..
మొదటి సంవత్సరం ఫీజు పూర్తిగా చెల్లించాలని కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన ఈ సంవత్సరం ఫీజు కట్టడం ఆలస్యమైందని తెలిపారు.
అర్ధరాత్రి పిల్లవాడిని లోపల అనుమతించకుండా బయటికి పంపించడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కాలేజీ దగ్గరే కూర్చున్నాము..