ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్: డీజీపీ

 ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్: డీజీపీ


AP: రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగిందని.. ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. “సైబరైమ్ అనేది దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ పెట్టాలని యోచిస్తున్నాం. నిపుణులను ఉపయోగించుకోవడం.. ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం” అని పేర్కొన్నారు.