ఎన్టీఆర్ జిల్లా:
ఏ కొండూరు మండలం గోపాలపురంలో వైసిపి మహిళా నేత భూక్య చంటి కుటుంబాన్ని పరామర్శించిన వైసిపి నేతలు..
*మాజీ మంత్రి మేరుగ నాగార్జున కామెంట్స్..*
మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత బాధితు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాం..
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం పూర్తిగా అపహస్యం అవుతుంది..
రాజ్యాంగం విలువల్ని తాకట్టుపెట్టే విధంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందటంలో భూక్య చంటి ఒక ఉదంతం.
భూక్య చంటి కుటుంబానికి సంబంధించి వాళ్ల ఆస్తుల్ని భాగాలుగా పంచుకునే క్రమంలో పేదవాళ్ళను,గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తూన్నాడు.
ఒక ఎస్సీ శాసనసభ్యుడైఉండి నీకన్నా ఇంకా తక్కువ కులాలను దారుణంగా బూట కాళ్ళతో తన్ని చిత్రహింసలకు పెట్టాడు.
చివరకు ఆమె సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు.
నువ్వు పరిపాలనలో భాగస్వామివా అని నిలదీశారు. ఎందుకు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నావని ప్రశ్నించారు.
ఈ ఘటనకు కారకుడైన ఎమ్మెల్యే పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే చేసిన దాడిని కప్పు పుచ్చుకునేందుకు పేదవాళ్లు, గిరిజనులపై దాడి చేసి అఘాయిత్యం చేసి, అమానుషంగా కొట్టి దారుణాలు చేస్తా ఉంటే ప్రజాస్వాములు ఉన్నావా లేదా అని డిమాండ్ చేశారు..
ఎమ్మెల్యే ఇంత దారుణాలు చేస్తే క్రమశిక్షణ సంఘం పిలిచారు.
ఎమ్మెల్యే చేసిన దానికి మ్యాండిటరీ ఇచ్చి పంపించడమా అని క్రమశిక్షణ సంఘాన్ని ప్రశ్నించారు.
ఈ సంఘటనకు కారణమైన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం..
మా ప్రభుత్వంలో ఇట్లాంటి దారుణాలు చోటు చేసుకోలేదు మా ముఖ్యమంత్రి బాధ్యతయుతమైన పాలన అందించారు.
ఏమైనా తప్పులు జరిగితే శాసనసభ్యులపై చర్యలు తీసుకున్న సంఘటన కూడా వైసిపి ప్రభుత్వంలో ఉన్నాయన్నారు.
ఎందుకు కొలికపూడి శ్రీనివాసరావుపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదు..
తూతు మంత్రంగా పిలిచి క్రమశిక్షణ చర్యలంటూ ఆయనకు ముద్ర వేసి మళ్లీ పంపించి పేదవాళ్లు,గిరిజన పై దాడులు చేయించాలనా.
రాష్ట్ర ప్రభుత్వం, టిడిపి పార్టీ ఇన్వాల్వ్ కావాలి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు..
పోలీసులను,అధికారుల్ని అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారేమో..
జగన్మోహన్ రెడ్డి డేగ కన్నుతో మీ వెనకే ఉంటాం.. ఈ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది..
ఇకనైనా పోలీసు వారు ఎమ్మెల్యే పై పెట్టిన కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి, న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టాలి- మాజీ మంత్రి మేరుగ నాగార్జున..
*_వైసిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కామెంట్స్_ ..*
ఒక ప్రైవేట్ స్థల వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యారు.
భూక్యా చంటి కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసి బూటు కాలితో తన్ని ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు..
క్రమశిక్షణ కమిటీ అనే పేరుతో పిలిచి కేవలం స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు..
నిజంగా ఎవరైతే గాయపడ్డారో నష్టపోయారో వాళ్లకు కుటుంబ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం..
ఈ రోజుకు ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయలా, ఎమ్మెల్యేతో పాటు దాడిలో పాల్గొన్న వారిపై చర్యలు లేవు..
ఎమ్మెల్యే దాడి చేస్తున్న ఘటనను తన కుమారుడు వీడియో తీస్తే ఎస్సై ఆ ఫోను తన దగ్గరే ఉంచుకున్నాడు.
పాస్వర్డ్ చెప్పి ఆ దాడి ఘటన వీడియో డిలీట్ చేస్తేనే ఫోన్ ఇస్తామంటూ నీచంగా కూటమి ప్రభుత్వం అధికారులు ప్రవర్తిస్తున్నారు..
స్వామిదాస్ పదేళ్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో పనిచేశారు.
వైసిపి ఎమ్మెల్యే పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఏరోజైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు..
రాష్ట్రవ్యాప్తంగా టిడిపి వాళ్లు ఏం చేస్తున్నారో ఉదాహరణే తిరువూరు నియోజకవర్గం..
మనుషుల మీద దాడులు, హాస్టల్ మీద దాడులు, డబ్బులివ్వకపోతే పోలీసులు అడ్డం పెట్టుకుని వాళ్ల మీదే చర్యలు తీసుకోవడం..
టిడిపి కార్యకర్తలే ఎమ్మెల్యే పై కంప్లైంట్ చేసే పరిస్థితి ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు..
*వైసిపి తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్ కామెంట్స్..*
భూక్య చంటి వాళ్ళది ప్రైవేట్ స్థలం సంబంధించిన వివాదం..
ఎమ్మెల్యేకు సంబంధం లేని విషయం,ప్రభుత్వ స్థలం అంటున్నారు..
మసిబుసి మారేడు కాయ చేసే చేస్తున్నాడు ఎమ్మెల్యే కొలికపూడి..
నేను టిడిపిలో ఉన్నప్పుడు నాపై కూడా దాడి చేశారని చెప్తున్నాడు.
కానీ నాపై దాడి చేసిన సంఘటనలు ఎప్పుడూ లేవు, ఎమ్మెల్యే నోరు తెరిస్తే అబద్ధాలే..
సమస్య పక్కదారి పట్టించేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు..
కొలికపూడి పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి..
ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరును వైఎస్ఆర్సిపి తీవ్రంగా ఖండిస్తున్నాం..
*వైసిపి ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..*
ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు జరగడం ఈ తిరువూరు నియోజకవర్గంలోనే చూస్తున్నాం..
ఈ ఉమ్మడి కృష్ణాజిల్లాలో క్రమశిక్షణ సంఘం ఎదుట రెండుసార్లు హాజరైన ఎమ్మెల్యే ఎవరు లేరు.
ఎమ్మెల్యే హింస నుండి అరాచకాలు నుండి ప్రజలను కాపాడుకుంటాం..
*విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కామెంట్స్..*
మహిళలకు అండగా ఉంటామంటూ సభల్లో మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏం సమాధానం చెబుతారు..
గతలో ఒక మహిళ ఎంపీపీ పై దాడి చేశారు, ఇప్పుడు ఎస్టీ మహిళపై దాడి..
ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా, ఇది అసలు పరిపాలనైనా, ఇది రౌడీ రాజ్యమా లేక రెడ్ బుక్ రాజ్యాంగమా..
ఒక ఎస్టీ కుటుంబం పై దాడి చేసిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోరా..
గతంలో మహిళలకు ఒక రక్షణగా వైయస్ జగన్ దిశ చట్టాన్ని తెచ్చారు..
50%రిజర్వేషన్లతో మమ్మల్ని వెలుగులోకి తెచ్చిన ఘనత వైఎస్ జగన్ అయితే, మహిళలపై దాడి చేస్తుంది ఘనత కూటమి ప్రభుత్వానిదే..
*వైసిపి జగ్గయ్యపేట నియోజకవర్గం ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు కామెంట్స్*
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరు చాలా వివాదాస్పదంగా ఉంది..
భూక్య చంటి కుటుంబం పై ఎమ్మెల్యే,అతని అనుచరులు చేసిన దాడి అమానుషం..
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది
ఈ ఘటనకు వారి పై మర్డర్ కేసు నమోదు చేయాలి ..