విజయనగరం జిల్లా పోలీస్|

 *||విజయనగరం జిల్లా పోలీస్||*

*||బాధితుల సమస్యలను తక్షణమే చట్టపరిధిలో పరిష్కరించాలి||*

*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*














❇️ *ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*


❇️ *సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ*


❇️ *సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, సమస్యలను వివరించి, చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*


విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు

'ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనవరి 20, సోమవారం నాడు నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ గారు ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు

వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో

చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.


పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీగారు 32 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన

ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించినవి 4, కుటుంబ కలహాలకు సంబంధించినవి 1, మోసాలకు పాల్పడినట్లుగా 7,

ఇతర అంశాలకు సంబంధించినవి 20 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు

చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” ద్వారా

స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7 దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు

చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదించాలని

అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, డిసిఆర్బి సిఐ ఎస్.శంకరరావు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్ఐ రాజేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


*||జిల్లా పోలీసు కార్యాలయం,||*

*||విజయనగరం.||*