*నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*
*యువగళం పాదయాత్రకు రెండేళ్లు పూర్తి కావడంతో.....మంత్రి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే*
*ప్రజలకు మంచి చేయడంలో....నాలో స్ఫూర్తి నింపిన నేతల్లో లోకేష్ ఒకరు....*
గుడివాడ జనవరి 27:యువగళం పాదయాత్రతో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఏపీలో సరికొత్త అధ్యాయం సృష్టించారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తి కావడంతో మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే రాము శుభాకాంక్షలు తెలిపారు.
ఐటీ,మానవవనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ఒక సామాన్య వ్యక్తిగా పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యువ నేత లోకేషే కీలక పాత్ర పోషించారు అని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.అయిదేళ్ల అరాచక పాలనపై సమరశంఖం పూరించి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర నేటితో రెండేళ్లు పూర్తి కావడం సంతోషకరమన్నారు.
రాష్ట్రంలో 5కోట్లమంది ఆశలు, ఆశయాలను ప్రతిబింబిస్తూ కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి 2023 జనవరి 27వతేదీన పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లిన యువనేత నారా లోకేష్ యువగళంతో రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్నే మార్చేశారన్నారు. 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, అపూర్వ ఆదరణ మధ్య యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ సాగిన యువగళం పాదయాత్ర ప్రజాచైతన్యంలో సంపూర్ణ విజయం సాధించడమే కాక అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో కీలకపాత్ర పోషించిందన్నారు.
యువగళం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారంటే పాదయాత్ర ఎంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చన్నారు.లక్షలాది ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని కుటుంబసభ్యుడిలా భావించి తమ బాధలు చెప్పుకుంటూ యువనేతకు జనం నీరాజనాలు పట్టారన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన మంత్రి లోకేష్ కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రాము కొనియాడారు. మంత్రి లోకేష్ స్ఫూర్తితోనే రాజకీయంగా ముందుకు వెళతానని ఎమ్మెల్యే రాము పునరుద్ఘటించారు.