ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మాధబానంద కర్
విజయవాడ : మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్. డాక్టర్ మాధబానంద్ కర్ ( Prof. Dr. Madhabananda Kar) మర్యాదపూర్వకంగా కలిశారు.. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ది పనులపై కాసేపు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కల్నల్ శశికాంత్ తుమ్మ పాల్గొన్నారు.