ప్రచురణార్థం:-21-1-2025
ధి:21-1-2025 మంగళవారం ఉదయం 11:00"గం లకు" ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు బందర్ రోడ్డు PWD గ్రౌండ్స్ లో ఉన్న భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మరియు విగ్రహ పరిసర ప్రాంతాలను, అంబేద్కర్ గారి మ్యూజియంను పరిశీలించడం జరిగినది...
ముందుగా బొండా ఉమా గారు మరియు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడుతూ :- భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని 2014 TO 2019 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు గారు అమరావతిలో ఒక స్మృతి మనాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేయడం జరిగిందని...
తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని ని విచ్ఛిన్నం చేసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో PWD గ్రౌండ్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటులో చాలా అవకతవతలు జరిగినాయి అని పలు వార్తలు వచ్చినాయని...
2024 లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మహనీయుని విగ్రహాన్ని ఈ స్మృతి వనాన్ని అద్భుత రీతిలో తీర్చేదిద్దాలని NDA కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగినదని...
ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను త్వరగా పూర్తిచేసి, దీనిని ఏ రకంగా తీర్చిదిద్దితే భవిష్యత్తు తరాలకు ఉంచుతామని అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది....