మైలవరంలో మిన్నంటిన మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవ వేడుకలు.
పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు.
లంకా లితీష్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 23.01.2025.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవ వేడుకలు మైలవరం పట్టణంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలలో స్థానిక శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొని కేకును కట్ చేశారు. నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. తొలుత స్వర్గీయ, అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టడానికి శ్రీ నారా లోకేష్ గారు సర్వశక్తులు ఒడ్డిస్తున్నారని అన్నారు. తాతకు తగిన మనుమడిగా, తండ్రికి తగిన తనయుడిగా లోకేష్ గారు పాలనలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారన్నారు. ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు గౌరవ సీఎం చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు దావోస్ లో పర్యటిస్తున్నారని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. టీడీపీ కుటుంబాన్ని కోటికి పైగా విస్తరించిన రథసారథి లోకేష్ గారు అని పేర్కొన్నారు. విద్యారంగంలో కూడా ఆయన ఆలోచనలు బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయన్నారు. మంచి మనసున్న శ్రీ నారా లోకేష్ గారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీస్సులు లోకేష్ గారికి ఎప్పుడూ ఉంటాయన్నారు.
ముందుగా తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు లంకా లితీష్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వార్త మండలి, నవజనత దినపత్రికల నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం వేముల బాబు గారి ఆధ్వర్యంలో కటారి ఉమామహేశ్వరరావు గారి ట్రాక్టర్ షెడ్లో శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారికి ఘనంగా స్వాగతం లభించింది. ఎన్డీఏ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.