*ప్రచురణార్థం* *18-01-2025*
దేశానికి సంక్షేమ పథకాల మార్గదర్శనం చేసిన దార్శనీకుడు ఎన్టీఆర్ : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి
నివాళులర్పించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్
సినీ, రాజకీయ రంగంలో రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్
రికార్డుల పరంపరను కొనసాగిస్తున్న నారా లోకేష్
విజయవాడ : పేదవాళ్లకి కూడు, గూడు , గుడ్డ అనే నినాదంలో తెలుగు దేశంపార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రజల అభివృద్ది కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించాడు. ఎన్టీఆర్ రాష్ట్రానికే కాదు దేశానికే సంక్షేమ పథకాల మార్గదర్శనం చేసిన దార్శనీకుడని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కొనియాడారు.
ఎన్టీఆర్ 29వ వర్దంతి సందర్భంగా శనివారం పటమటలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌తో పాటుగా పార్టీ నాయకులు పాల్గొని పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సినిమా, రాజకీయ రంగాల్లో నందమూరి తారక రామారావు రికార్డులను సృష్టించారన్నారు. ఎన్టీఆర్ సృష్టించిన రికార్డుల పరంపరను ఆయన మనుమడు నారా లోకేష్ కొనసాగిస్తున్నారని అన్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి కోటి మంది కి పైగా సభ్యత్వాలను సాధించి నారా లోకేష్ రికార్డు సృష్టించారని అన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే టీడీపీని అధికారంలోకి తెచ్చిన నందమూరి తారక రామారావు దేశంలోనే ప్రప్రదమంగా ప్రజలకు కిలో బియ్యం రెండు రూపాయలకే అందించి పేదవాడి ఆకలి తీర్చిన ప్రజా నాయకుడన్నారు.
సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఎన్నో రికార్డులను సృష్టించారని చెప్పారు. రైతు కుటుంబం నుంచి జీవితం ప్రారంభించి సినీ రంగంలో ఉన్న రికార్డులే కాకుండా ప్రాంతీయ పార్టీ పెట్టి రాజకీయంగా ఉన్న రికార్డులను కూడా ఎన్టీఆర్ బద్దలు కొట్టారన్నారు. సినిమా రంగంలో మకుటంలేని మహారాజుగా ఎదిగిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ పీఠంపై ఉన్న కాంగ్రెస్ పార్టీని గడగడలాడించారని చెప్పారు.
కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆ విధానాన్నే కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2047 సంవత్సరంలోపు స్వర్ణాంధ్రప్రదేశ్ వైపునకు రాష్ట్రాన్ని అడుగులు వేయిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ సాధించిన రికార్డులకు కొనసాగింపుగా నారా లోకేష్ సారధ్యంలో ఒక ప్రాంతీయ పార్టీకి కోటి సభ్యత్వాలు ఉండటం మరో రికార్డు అని ఎంపీ శివనాథ్ చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళతామని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2లకు కిలో బియ్యం పథకం దేశం మొత్తాన్ని ప్రభావితం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశం మొత్తం అమలు చేస్తోందన్నారు. పేదలకు ఫించను ఇచ్చే పథకాన్ని కూడా ఎన్టీఆర్ ప్రారంభించారని చెప్పారు. ఈ రోజు పేదలు నెలకు రూ.4 వేలు ఫించను తీసుకుంటున్నారంటే ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించబట్టేనని అన్నారు. పేదలకు పక్కా గృహలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఎన్టీఆర్‌దేనని అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పక్కా ఇళ్ళు నిర్మాణం చేసి పేదలకు ఇస్తోందన్నారు. ఎన్టీఆర్ వేసిన దారిలోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని అన్నారు. అలాంటి మహానుభావుడు స్థాపించిన పార్టీలో తాను ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన ఆశయాలను తామంతా కలిసి కట్టుగా ఉండి ముందుకు తీసుకువెళతామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.
ఈ కార్యక్రమములో పార్టీ నాయకులు బొప్పన భవకుమార్, చెన్నుపాటి గాంధీ, కోనేరు శ్రీధర్, కార్పోరేటర్లు ముమ్మనేని ప్రసాద్, దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, చెన్నుపాటి కాంతిశ్రీ, టిడిపి నాయకులు అడపా నాగేంద్ర, గరికపాటి బద్రి, నర్రా కిషోర్, గాదిరెడ్డి అమ్ములు, కొలసాని నాగమణి, పలువురు డివిజన్ అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.