ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఇద్దరికి సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు అందజేత
విజయవాడ : పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యమన్నారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.1,62,000 చెక్కును విజయవాడ 50వ డివిజన్ కి చెందిన జె.సరస్వతికి అందజేశారు. ఇటీవల మోకాలు మార్పిడి ఆఫరేషన్ చేయించుకున్న సరస్వతి ఎంపి కేశినేని శివనాథ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంది.
విజయవాడ కి చెందిన ఘంటశాల నూర్జహాన్ కు రూ.55,700 చెక్కును అందజేశారు. ఆమె పక్షవాతానికి గురై వైద్య సాయం కోసం సీఎంఆర్ఎఫ్ కి దరఖాస్తు చేసుకుంది.. ఈ చెక్కును ఆమె కొడుకు జి.నాగూర్ అందుకున్నారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎంపి కేశినేని శివనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు.