హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఉరుసు మహోత్సవంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు

 *ఎన్.టి.ఆర్ జిల్లా  పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ*

*పత్రికా ప్రకటన*                                 

*తేది.10-01-2025*

*హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఉరుసు మహోత్సవంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు*





















ఎన్.టి.ఆర్.జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిది, కొండపల్లి పట్టణ పరిధిలోని హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా దర్గా 428వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు ముఖ్య అతిదిగా పాల్గొని దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి ప్రార్థనలు నిర్వహించినారు.


ఈ నేపధ్యంలో ఉరుసు మహోత్సవ కమిటీ సభ్యులు నగర పోలీస్ కమీషనర్ గారిని సాదరంగా మేళ తాళాలతో ఆహ్వానించినారు, నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం కొండపల్లి ఆస్థాన పీఠాధిపతి, షా బుఖారి బాబా నిత్యాన్నదాన నిర్వాహకులు అల్తాఫ్ బాబా గార్లు నగర పోలీస్ కమీషనర్ గారిని ఇస్లాం సంప్రదాయ ప్రకారం సన్మానించారు.


ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ.... ప్రతి సంవత్సరం ఉరుసు మహోత్సవంలో పోలీస్ శాఖ తరపున చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, ఆనవాయితీని కొనసాగిస్తూ తాను కూడా చాదర్ సమర్పించినట్లు తెలిపారు. ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం సంతోషకరమని, కుల మతాలకు అతీతంగా భక్తులు బాబావారిని సందర్శించటం మత సామరస్యానికి చిహ్నమని తెలిపారు.ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గంధం సమర్పించే సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బందోబస్తు నిర్వహించాలని, అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇక్కడ నిత్యం జరిగే అన్నదాన కార్యక్రమం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం కొద్ది సేపు అన్నదాన కార్యక్రమంలో వడ్డన చేసారు. 


 ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ గారు, పశ్చిమ జోన్ ఏ.డి.సి.పి. శ్రీ గుణ్ణం రామకృష్ణ గారు, పశ్చిమ ఏ.సి.పి. శ్రీ దుర్గారావు గారు, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‌

* * *