*కృష్ణాజిల్లా మచిలీపట్నం* *ఔరా...!? ఇవేం స్టెప్పులు కలెక్టర్ సారూ..!* సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కలెక్టర్ దంపతుల డ్యూయెట్ సాంగ్ వీడియోలు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పలు సినిమాల్లోని డ్యూయెట్ సాంగ్స్ కు స్టెప్పులు వేసిన కలెక్టర్ దంపతులు..
కలెక్టర్ దంపతుల డ్యాన్స్ వీడియోలను చూసి ఔరా అంటున్న ప్రజలు.. రిపబ్లిక్ డే అంటే ఓ పవిత్రమైన రోజు, దేశం గర్వించదగ్గ రోజు.. మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు.. ఈ రోజు ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది.. కానీ ఈ కలెక్టర్ గారు మాత్రం ఉదయం దేశ భక్తి సేవలో తరించి.. సాయంత్రం డ్యూయెట్ సాంగ్స్ కు డ్యాన్స్ వేసి జిల్లా అధికారులను అలరించడం చర్చనీయాంశంగా మారింది.. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులకు 'AT HOME' పేరిట తేనేట్ విందు ఇచ్చారు.. ఈ వేడుకల్లో కలెక్టర్ బాలాజీ దంపతులు పలు డ్యూయెట్ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు.. కలెక్టర్ దంపతుల డ్యాన్స్ కు జిల్లా అధికారులు మైమరచిపోయారు.. వాళ్లు కూడా కలెక్టర్ తో కలిసి ఆడిపాడారు.. కొసమెరుపు ఏమిటంటే ఈ వేడుకలకు మీడియాను పూర్తిగా దూరం పెట్టడం.. సమాచార శాఖాధికారులు ఫోటోలు, వీడియోలు తీసినా మీడియాకు రిలీజ్ చేయకపోవడం.. కానీ జిల్లా అధికారుల్లోనే కొంత మంది కలెక్టర్ దంపతుల డ్యాన్స్ వీడియోలను లీక్ చేశారు.. ఇప్పుడు ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.