*హెచ్ఎంపీవీ(కొత్తవైరస్)పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తత*
*సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్...ఇప్పటి వరకూ ఎటువంటి అనుమానిత కేసులు నమోదు కాలేదన్న అధికారులు*
అమరావతి, జనవరి 6 : దేశంలో హెచ్ఎంపీవీ (వైరస్) కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి వెళ్లే వాళ్ళపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్ధేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యకుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులు భాగస్వాములయ్యారు.