*చిత్తూరు జిల్లా పోలీసు*
*పత్రికా ప్రకటన*
*ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం: ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక*
*చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇంచార్జ్ అడ్మిన్ శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు గారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని సోమవారం జిల్లా AR పోలీసు కార్యాలయంలో నిర్వహించారు.*
*ఈ కార్యక్రమంలో ప్రజల నుండి 66 ఫిర్యాదులను స్వీకరించారు.*
* ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా, వాటిని సమర్థవంతంగా తీర్చాలంటూ, అడిషనల్ ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు దారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి, అడిషనల్ ఎస్పీ గారిని మరియు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ టి. సాయినాథ్ గారిని కలిసి తమ సమస్యలను వినిపించారు.
* ఫిర్యాదులకు స్పందిస్తూ, బాధితుల ఎదుటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఫిర్యాదులన్నింటిపై చట్టపరమైన విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా సమస్యలు పరిష్కరించాలంటూ అడిషనల్ ఎస్పీ గారు స్పష్టం చేశారు.
*ఈ కార్యక్రమంలో మొత్తం 66 ఫిర్యాదులు అందాయి, వాటి వివరాలు...*
చీటింగ్ - 1, కుటుంభ తగాదాలు – 14, వేదింపుల – 1, ఇంటి తగాదాలు – 2, భూ తగాదాలు – 22, డబ్బు తగాదాలు – 19, ఆస్తి తగాదాలు - 7.