తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ విషయంలో తొక్కిసలాటలో బక్తులు మరణించడం పై

విజయవాడ

*తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి  టికెట్ల జారీ విషయంలో తొక్కిసలాటలో బక్తులు మరణించడం పై ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ  అద్యక్షులు దేవినేని అవినాష్ సంతాపం తెలియజేసారు..*



*దేవినేని అవినాష్ కామెంట్స్*


వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.


ప్రభుత్వం తరఫున ప్రతి మరణించిన కుటుంబానికి కోటి రూపాయలు, గాయపడిన వ్యక్తులు అందరికీ 50 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని చేసి, మెరుగైన వైద్య సదుపాయాలని కల్పించాలి అని డిమాండ్ చేస్తున్నాం..


లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది.


నేడు కూటమి ప్రభుత్వం తిరుపతిని ప్రచార ఆర్భాటానికి, రాజకీయ కక్షసాధింపులకు వేదికగా మార్చేసింది.


కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి నాయకులు అందరు బాధ్యత వహించాలి..


ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రతిష్టలును కూటమి ప్రబుత్వం అప్రదిష్టపాలు  చేసింది..  


కేవలం లడ్డు వివాదం లాంటి డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయ వేధింపులకు, రాజకీయ కుట్రలకు మాత్రమే కేంద్రంగా చేసుకోవడం బాధాకరం.


వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రబుత్వంలో తిరుమలలో  ఎలాంటి చిన్న ఘటన కూడా జరగలేదు.. 


భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో టీటీడీ మరయు కూటమి ప్రబుత్వం అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు.. 


కూటమి ప్రబుత్వం రాష్ట్రం లో వైసిపి నాయకుల మీద రాజకీయ కక్ష తిరుచుకోవడం,డైవర్షన్ రాజికియలు చేయడం తప్ప ఆరు నెలలో ప్రజలకి చేసింది ఏమి లేదు..